AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయోగానికి సిద్దమవుతున్న యంగ్ హీరో.. ఆ సినిమాలో చెవిటి మూగ యువకుడి పాత్రలో కనిపించనున్న నాగశౌర్య

ప్రయోగాలు చేయడానికి టాలీవుడ్ హీరోలు ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. స్టార్ డమ్ ను పక్కన పెట్టి కథను నమ్మి సినిమాలు చేస్తుంటారు. ఇలా చాలా సినిమాలు తెలుగులో వచ్చాయి.

ప్రయోగానికి సిద్దమవుతున్న యంగ్ హీరో.. ఆ సినిమాలో చెవిటి మూగ యువకుడి పాత్రలో కనిపించనున్న నాగశౌర్య
Rajeev Rayala
|

Updated on: Dec 19, 2020 | 1:08 PM

Share

ప్రయోగాలు చేయడానికి టాలీవుడ్ హీరోలు ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. స్టార్ డమ్ ను పక్కన పెట్టి కథను నమ్మి సినిమాలు చేస్తుంటారు. ఇలా చాలా సినిమాలు తెలుగులో వచ్చాయి. అయితే వచ్చిన సినిమాలన్నీ విజయం సాధించకపోయిన నటులకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటీవల ‘నిశబ్దం’ సినిమాలో అనుష్క చెవిటి మూగ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ యంగ్ హీరో కూడా ఇలాంటిపాత్రలోనే నటించడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య. ‘ఛలో’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. త్వరలో నటించే సినిమాలో చెవిటి మూగ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది.

ఇక శౌర్య వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత మరో మూడు సినిమాలకు సైన్ చేసాడు ఈ యంగ్ హీరో. నాగశౌర్య నటిస్తున్న ఓ సినిమాలో నందమూరి బాలకృష్ణ అతిధి పాత్రలో  కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాలోనే శౌర్య చెవిటి మూగ యువకుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. శౌర్య పాత్ర చాలా ఆహ్లాదకరంగా వినోదాత్మకంగా ఉంటుందట. ఈ మూవీకి శ్రీమాన్ వేముల దర్శకత్వం వహించనున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా అప్డేట్స్ ను ఇవ్వనున్నారని, వచ్చే ఏడాది ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారని ఫిలిం నగర్లో టాక్ నడుస్తుంది.

Follow Us
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
సాధారణ కీళ్ల నొప్పులకు, ఆర్థరైటిస్‌కు మధ్య తేడా ఏంటి?..
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
క్లాసికల్ సినిమా ఆడదు అన్నారు.. కట్ చేస్తే.. ఇండస్ట్ర్లీలోనే పెద్
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
విమానాన్ని తలపించేలా ఆర్టీసీ లగ్జరీ బస్సులు..హాస్టెస్, వైఫై ఎన్నో
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
ఢాకేశ్వరి ఆలయం: బంగ్లాదేశ్‌లోని 800 ఏళ్ల పురాతన దుర్గాదేవి ఆలయం..
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
వేల కోట్లు ఆదా.. రికార్డు వేగంతో పనులు.. 5 ఏళ్లలో పీఎం గతిశక్తి
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
ప్రెగ్నెంట్‏గా ఉండి ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశా..
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
మంచం దగ్గరకు గుర్రాలు.. తల్లి చివరి కోరిక తీర్చిన కూతురు!
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
కేతువు సంచారం ఎఫెక్ట్.. 56 రోజుల పాటు ఈ 5 రాశులకు అదృష్టమే..
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
అదిరిపోయే ఫీచర్లతో కోడాక్ స్మార్ట్‌ టీవీ
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?
చికెన్‌ బ్రెస్ట్‌, లెగ్‌ పీస్‌.. ఏది తీసుకుంటే మంచిది?