‘యాత్ర’ దర్శకుడితో నాగార్జున మూవీ..!
సినిమాల్లో నాగార్జున మళ్లీ వేగం పెంచారు. ప్రస్తుతం అశిషోర్ సోలోమన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తోన్న నాగార్జున
Nagarjuna Yatra director: సినిమాల్లో నాగార్జున మళ్లీ వేగం పెంచారు. ప్రస్తుతం అశిషోర్ సోలోమన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తోన్న నాగార్జున.. ఆ తరువాత ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్‌లో నటించనున్నారు. వీటితో పాటు హిందీలో బ్రహ్మాస్త్రలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం మరో చిత్రానికి నాగార్జున ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆనందోబ్రహ్మ, యాత్ర చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన మహి వి రాఘవ దర్శకత్వంలో నాగ్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటికే నాగార్జునను మహి వి రాఘవ కలవడం, కథ చెప్పడం, అది ఆ హీరోకు నచ్చేయడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఇక క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉండబోతున్నట్లు టాక్. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ మూవీకి స్క్రిప్ట్ రాసే పనిలో యాత్ర దర్శకుడు ఉన్నట్లు తెలుస్తుండగా.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు బిగ్‌బాస్ నాలుగో సీజన్‌కి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు.
Read More: