అలా పాడలేకపోతే దేశం వదిలి వెళ్లిపో: హనీసింగ్‌పై ఫైర్

తన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ రాపర్ యోయో హనీసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళల గురించి అసభ్య పదజాలాలు వాడుతూ అతడు పాటలు పాడుతున్నారని పంజాబ్ మహిళా కమిషన్ ఛైర్మన్ మనీషా గులాటీ మండిపడ్డారు. ఈ మేరకు అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పంజాబ్ పోలీసులను ఆమె రెండు రోజుల క్రితం కోరారు. దీనిపై గులాటీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని చాలా దేశాలు హరే రామా హరే కృష్ణ అంటూ పాటలు పాడుతుంటే యోయో హనీ […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:43 am, Sat, 6 July 19
అలా పాడలేకపోతే దేశం వదిలి వెళ్లిపో: హనీసింగ్‌పై ఫైర్

తన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ రాపర్ యోయో హనీసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళల గురించి అసభ్య పదజాలాలు వాడుతూ అతడు పాటలు పాడుతున్నారని పంజాబ్ మహిళా కమిషన్ ఛైర్మన్ మనీషా గులాటీ మండిపడ్డారు. ఈ మేరకు అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పంజాబ్ పోలీసులను ఆమె రెండు రోజుల క్రితం కోరారు.

దీనిపై గులాటీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోని చాలా దేశాలు హరే రామా హరే కృష్ణ అంటూ పాటలు పాడుతుంటే యోయో హనీ సింగ్ మాత్రం మహిళలను కించపరిచేలా పాటలు పాడుతున్నాడు. ఇప్పటికైనా అతడి పాటల్లో అసభ్య పదజాలాన్ని ఆపాలి. లేకపోతే అతడు దేశం వదిలి వెళ్లిపోవడం మంచిది’’ అని పేర్కొన్నారు. కాగా ఇటీవల ‘మఖ్నా’ అనే పాటను విడుదల చేసిన యో యో హనీ సింగ్ అందులో ‘ఐ యామ్ ఎ ఉమనైజర్’ అనే పదాన్ని వాడాడు. దీనిపై గులాటీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర హోం సెక్రటరీకి, డీజీపీకి ఆమె లేఖ రాశారు. మరోవైపు ఈ వివాదంపై డీజీపీ దినకర్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘దీనిపై దర్యాప్తు చేస్తున్నాం. మహిళలపై అసభ్యపదజాలం వాడారని తేలితే చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.