AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రుతీ ఆశలు నెరవేరుతాయా..!

తండ్రికి తగ్గ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలో మంచి పేరునే సాధించుకుంది లోకనాయకుడు తనయ శ్రుతీ హాసన్. కేవలం హీరోయిన్‌గానే కాదు సింగర్‌, మ్యూజిక్ డైరక్టర్‌గా ఆమె అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు మంచి పర్‌ఫార్మెన్స్‌తో పలు హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఇటాలియన్‌కు చెందిన మైఖేల్‌తో ప్రేమలో పడటంతో సినిమాలకు దూరమైంది. ఇలా దాదాపుగా రెండు సంవత్సరాలుగా ప్రేక్షకులను పలకరించలేదు ఈ బ్యూటీ. కాగా ఇటీవలే శ్రుతీకి, మైఖేల్‌తో బ్రేకప్ అవ్వడంతో.. […]

శ్రుతీ ఆశలు నెరవేరుతాయా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 09, 2019 | 6:50 PM

Share

తండ్రికి తగ్గ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలో మంచి పేరునే సాధించుకుంది లోకనాయకుడు తనయ శ్రుతీ హాసన్. కేవలం హీరోయిన్‌గానే కాదు సింగర్‌, మ్యూజిక్ డైరక్టర్‌గా ఆమె అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు మంచి పర్‌ఫార్మెన్స్‌తో పలు హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఇటాలియన్‌కు చెందిన మైఖేల్‌తో ప్రేమలో పడటంతో సినిమాలకు దూరమైంది. ఇలా దాదాపుగా రెండు సంవత్సరాలుగా ప్రేక్షకులను పలకరించలేదు ఈ బ్యూటీ. కాగా ఇటీవలే శ్రుతీకి, మైఖేల్‌తో బ్రేకప్ అవ్వడంతో.. ఇప్పుడు సినిమాలపై మళ్లీ ఫోకస్ పెట్టింది. అప్పటిలా కాకుండా తనకు మంచి ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటోందట.

ఈ క్రమంలో ఇప్పుడు శ్రుతీహాసన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో కోలీవుడ్‌లో విజయ్ సేతపతి ‘లాభం’, హిందీలో ‘పవర్’.. తెలుగులో రవితేజ 66వ చిత్రం. వీటిలో పవర్ షూటింగ్ పూర్తి అవ్వగా.. లాభం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీ షూటింగ్‌లో శ్రుతీహాసన్ అదరగొట్టేసిందట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇటీవల వెల్లడించింది. శ్రుతీ హాసన్ హార్డ్ వర్క్‌కు హ్యాట్సాఫ్ అంటూ దర్శకుడు కూడా కితాబిచ్చాడు. ఇక రవితేజ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. వీటితో పాటు మరో హాలీవుడ్ ప్రాజెక్ట్‌లోనూ భాగం కాబోతోంది శ్రుతీ. ప్రముఖ డిస్నీ సంస్థ తెరకెక్కించిన ‘ఫ్రోజెన్ 2’ను ఇండియాలోని కొన్ని భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలోని ఎల్సా కారెక్టర్‌కు తమిళ్‌లో డబ్బింగ్ చెప్పబోతోంది శ్రుతీ. వీటన్నింటిని బట్టి చూస్తుంటే శ్రుతీ మళ్లీ బిజీ అయినట్లు అర్థమవుతున్నా.. మునుపటి స్థానాన్ని సంపాదించుకోగలదా..? అన్నది కాస్త అనుమానంగా మారింది. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీల్లోనూ కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తున్న ఈ కాలంలో.. దర్శకనిర్మాతలు మొదట వారికే ప్రాముఖ్యతను ఇస్తున్నారు. దీంతో ఇన్ని రోజులు టాప్ హీరోయిన్లుగా పేరొందిన కాజల్, తమన్నా, అనుష్క, సమంత లాంటి హీరోయిన్లకు అప్పటిలాగా స్టార్ హీరోల సరసన నటించే ఆఫర్లు రావడం లేదు. అలాగే ఇంకా ప్రభాస్ నటించాల్సిన టాప్ హీరోల లిస్ట్‌ కూడా బాగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో శ్రుతీ రీ ఎంట్రీ కెరీర్ ఎలా ఉండబోతోంది..? ఇంతవరకు నటించని టాప్ హీరోలతో ఇప్పుడైనా ఆమె నటిస్తుందా..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.