హిట్ వచ్చినా.. స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదా..!

సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. కొంతమంది ఫ్లాప్‌లతో తమ కెరీర్‌ను ప్రారంభించినా.. తరువాత తరువాత హిట్లు కొట్టి టాప్‌ లిస్ట్‌లో చేరిపోతుంటారు. మరికొందరికేమో మొదట్లో హిట్లు వచ్చినా.. తరువాత దాని నిలుపుకోలేక ఫేడౌట్ అవుతుంటారు. ఇంకొందరేమో అభినయం ఉన్నా.. ఆఫర్లు లేక అనతికాలంలోనే సినిమా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. మరి కొంతమంది చిన్న చిన్న ఆఫర్లతో సరిపెట్టుకుంటుంటారు. ఇప్పుడు యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ పరిస్థితి ఇలానే ఉంది. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది […]

హిట్ వచ్చినా.. స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదా..!
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2019 | 5:15 PM

సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. కొంతమంది ఫ్లాప్‌లతో తమ కెరీర్‌ను ప్రారంభించినా.. తరువాత తరువాత హిట్లు కొట్టి టాప్‌ లిస్ట్‌లో చేరిపోతుంటారు. మరికొందరికేమో మొదట్లో హిట్లు వచ్చినా.. తరువాత దాని నిలుపుకోలేక ఫేడౌట్ అవుతుంటారు. ఇంకొందరేమో అభినయం ఉన్నా.. ఆఫర్లు లేక అనతికాలంలోనే సినిమా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. మరి కొంతమంది చిన్న చిన్న ఆఫర్లతో సరిపెట్టుకుంటుంటారు. ఇప్పుడు యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ పరిస్థితి ఇలానే ఉంది.

సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నిధి. ఈ చిత్రం చేతిలో ఉండగానే.. వెంటనే మిస్టర్ మజ్నులో కూడా ఆఫర్ కొట్టేసింది. కానీ ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో.. ఆమె గ్రాఫ్ అలానే ఉండిపోయింది. అయితే ఆ తరువాత రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్‌లో ఛాన్స్ కొట్టేసిన నిధికి.. ఆ మూవీ హిట్‌తో కాస్త బూస్టప్ వచ్చినట్లైంది. ఇక ఈ మూవీ హిట్‌తోనైనా తనకు ఆఫర్లు వస్తాయని భావించింది. మరోవైపు వరుసగా పేరు మోసిన హీరోల సరసన నటించినప్పటికీ.. మిగిలిన స్టార్ హీరోలెవ్వరూ ఆమెను పట్టించుకోకపోగా.. ఇప్పుడు డెబ్యూట్ హీరోతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది ఈ బ్యూటీ. గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తోన్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనుంది. ఇక ఈ మూవీ మినహాయించి.. ఇప్పటివరకు ఆమెకు తెలుగులో మరో ఆఫర్ లేదు. అందాలు ఆరబోస్తున్నా.. ఆమె సైడ్ దర్శక నిర్మాతలు కూడాపెద్దగా చూడకపోవడం గమనర్హం(కొందరు హీరోయిన్లు అభినయం లేకపోయినా.. అందాలతో వరుస ఆఫర్లను కొట్టేస్తుంటారు). ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి ఇప్పుడు తమిళ్‌లో ఓ ఆఫర్ వచ్చింది. జయం రవి హీరోగా తెరకెక్కుతోన్న భూమిలో నిథి నటిస్తోంది. మరి అక్కడైనా నిధి హిట్ కొట్టి స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తోందేమో చూడాలి. అలాగే భవిష్యత్‌లోనైనా నిధికి టాలీవుడ్‌లో మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..