మొన్న రష్మిక.. నేడు నివేథా.. నెటిజన్లు మారరా..!

అభిమానులకు మరింత దగ్గరగా ఉండటం కోసం మన హీరో హీరోయిన్లు సోషల్ మీడియాలను వాడుకుంటుంటారు. అక్కడ తమ సినిమాల గురించి చెప్పడంతో పాటు.. అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చాట్ కూడా చేస్తుంటారు. అయితే ఇలా వారు చాట్‌ చేసే సమయంలో కొన్నిసార్లు కొంతమంది నెటిజన్ల నుంచి అసభ్యకర ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అయితే వీటిని కొందరు పట్టించుకోకపోగా.. మరికొందరు మాత్రం అలాంటివారికి ఘాటుగా కౌంటర్ ఇస్తుంటారు. ఇక ఇలాంటి అసభ్యకర ప్రశ్నలు మొన్నటికి మొన్న రష్మికకు ఎదురయ్యాయి. ఆమె చిన్నప్పటి […]

మొన్న రష్మిక.. నేడు నివేథా.. నెటిజన్లు మారరా..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 09, 2019 | 5:21 PM

అభిమానులకు మరింత దగ్గరగా ఉండటం కోసం మన హీరో హీరోయిన్లు సోషల్ మీడియాలను వాడుకుంటుంటారు. అక్కడ తమ సినిమాల గురించి చెప్పడంతో పాటు.. అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చాట్ కూడా చేస్తుంటారు. అయితే ఇలా వారు చాట్‌ చేసే సమయంలో కొన్నిసార్లు కొంతమంది నెటిజన్ల నుంచి అసభ్యకర ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అయితే వీటిని కొందరు పట్టించుకోకపోగా.. మరికొందరు మాత్రం అలాంటివారికి ఘాటుగా కౌంటర్ ఇస్తుంటారు. ఇక ఇలాంటి అసభ్యకర ప్రశ్నలు మొన్నటికి మొన్న రష్మికకు ఎదురయ్యాయి.

ఆమె చిన్నప్పటి ఫొటోను షేర్ చేసిన ఓ నెటిజన్.. ఎవరైనా ఊహించారా..? ఈ ఫొటోలో ఉన్న ఈ చిన్నపిల్ల ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అంటూ.. కొన్ని అసభ్యకర కామెంట్లు పెట్టాడు. దీంతో రష్మికకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఓ పెద్ద నోట్‌ను పెట్టింది రష్మిక. హీరోహీరోయిన్లను ట్రోల్ చేయడం ద్వారా ఏమొస్తుందో నాకు అర్థం కావడం లేదు. మేము ఏమీ అనలేమనే కదా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. సెలబ్రిటీలు అయినంత మాత్రానా.. మా గురించి ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదు. నేను సాధారణంగా నెగిటివ్ కామెంట్స్‌ను పట్టించుకోను. మా పని గురించి ఏమైనా చెప్పండి. కానీ మా వ్యక్తిగత విషయాలు, కుటుంబాల గురించి ట్రోల్ చేసే హక్కు మీకు లేదు. హీరోహీరోయిన్లు కావడం అంత సులభం కాదు. ఏ నటుడు ఇలాంటి అనవసర చెత్తకు బాధితులు అవ్వకూడదు అంటూ కామెంట్ పెట్టింది.

ఇక తాజాగా ఇలాంటి సంఘటనే యంగ్ బ్యూటీ నివేథా థామస్‌కు ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ సెషన్‌లో పాల్గొన్న నివేథాకు.. మీరు వర్జినా..? కాదా..? భాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారా..? లేదా..? ఇలా ఇబ్బందికర ప్రశ్నలను అడిగారు. దీంతో చాట్ ముగిసిన వెంటనే నివేథా స్పందిస్తూ.. నాతో మాట్లాడటానికి టైమ్ కేటాయించినందుకు థ్యాంక్స్. చాలామంది ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. కానీ కొంతమంది నన్ను దరిద్రమైన ప్రశ్నలు కూడా అడిగారు. వాటికి నేను సమాధానాలు చెప్పలేదు. మీరు మాట్లాడేది కూడా ఒక మనిషితోనే అని తెలుసుకోండి. అందరికీ మర్యాద ఇవ్వండి. త్వరలో మళ్లీ కలుద్దాం అంటూ ముగించింది.

అయితే సాధారణంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం కోసం హీరోహీరోయిన్లు చాలా కష్టపడుతుంటారు. తమ బాధలను తమలోనే దాచుకొని మరీ.. షూటింగ్‌కు వెళ్లిన హీరోహీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఒకవేళ తమకు ఏ నటీనటులైనా నచ్చకపోతే అభిమానించకపోయినా పర్లేదు గానీ.. ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మాత్రం నిజంగా బాధాకరమే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu