రానా ఈజ్ బ్యాక్.. ఆ దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్ నెరవేరినట్లే..!

టాలీవుడ్‌లో రానా చేతిలో ఉన్నన్ని సినిమాలు మరే నటుడికి లేవు. కానీ లాంగ్ బ్రేక్ తీసుకోవడం వల్ల ఆ సినిమాల షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. ఇక ఇటీవల రానాకు శస్త్ర చికిత్స జరగ్గా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ క్రమంలో త్వరలోనే షూటింగ్‌ల్లో పాల్గొని.. తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేయాలని అతడు భావిస్తున్నాడట. ఇదిలా ఉంటే రానాతో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘హిరణ్య కశ్యప’ సినిమాను తీయాలనుకున్న విషయం తెలిసిందే. కానీ అనారోగ్యం కారణంతో రానా ఆ ప్రాజెక్ట్ […]

రానా ఈజ్ బ్యాక్.. ఆ దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్ నెరవేరినట్లే..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 09, 2019 | 4:10 PM

టాలీవుడ్‌లో రానా చేతిలో ఉన్నన్ని సినిమాలు మరే నటుడికి లేవు. కానీ లాంగ్ బ్రేక్ తీసుకోవడం వల్ల ఆ సినిమాల షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. ఇక ఇటీవల రానాకు శస్త్ర చికిత్స జరగ్గా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ క్రమంలో త్వరలోనే షూటింగ్‌ల్లో పాల్గొని.. తాను ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేయాలని అతడు భావిస్తున్నాడట. ఇదిలా ఉంటే రానాతో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘హిరణ్య కశ్యప’ సినిమాను తీయాలనుకున్న విషయం తెలిసిందే. కానీ అనారోగ్యం కారణంతో రానా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చాడని, మరో హీరోతో ఈ సినిమాను తీసుకోవాలని గుణశేఖర్‌కు సూచించాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో రానాను తప్ప మరో హీరోను ఊహించుకోని గుణశేఖర్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టినట్లు టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలన్నింటికి తాజాగా దర్శకుడు చెక్ పెట్టాడు.

‘‘తెలుగు భాషపై పట్టు, తెలుగు సాహిత్యంపై అవగాహన కలిగి ఉన్న వారు సహాయ దర్శకులుగా చేసేందుకు తనకు సంప్రదించాలని’’ గుణశేఖర్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. దీంతో హిరణ్యకశ్యప ప్రాజెక్ట్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది. మరి ఈ మూవీ ఎప్పుడు ప్రారంభమవుతోంది..? ఈ ప్రాజెక్ట్‌లో ఎవరెవరు నటించబోతున్నారు..? ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు..? ఈ ప్రశ్నలన్నింటికి త్వరలోనే సమాధానం తేలనుంది. కాగా భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీతో పాటు ‘విరాటపర్వం’, ‘హాథీ మేరీ సాథీ’, ‘బిజు: ది ఇండియన్ ప్రైడ్’ తదితర సినిమాల్లో రానా నటించబోతున్నాడు.

https://www.facebook.com/Gunasekhar/posts/2446643302272611

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu