ఆ నవ్వు వెనుక ఉన్న అర్థం పరమార్ధం ఏమిటో? పవన్ మాజీ భార్య ఎందుకు నవ్వుతుందో తెలుసా?
టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత నటి రేణుదేశాయ్ చాలా బిజీగా మారిపోయింది.

టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత నటి రేణుదేశాయ్ చాలా బిజీగా మారిపోయింది. నిర్మాతగా, రచయితగా, దర్శకురాలిగా మారి ఇండస్ట్రీలో పలు రకాల పాత్రలు పోషిస్తోంది. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో ఎప్పుడు టచ్‌లో ఉంటూ తన ఫోటోలు, తన పిల్లల ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఒకటి వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో రేణు పెద్దగా నవ్వుతుంటే కూతురు ఆద్య పక్కన డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో గురించి రేణుదేశాయ్ ఓ కామెంట్ కూడా పెట్టింది. మేమే ఇలా ఎందుకు నవ్వుతున్నామో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందేనని తెలిపింది. దీంతో ఈ వీడియోపై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తెగ గుసగుసలు వినిపిస్తున్నాయి. రేణుదేశాయ్ నవ్వులో ఉన్న అర్ధం, పరమార్ధం ఏమిటో అర్థంకాక రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. పవన్‌తో విడిపోయిన తర్వాత రేణు పిల్లలను తీసుకొని మహారాష్ట్రలోని పుణెకు వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్ తిరిగి హైదరాబాద్‌కు మకాం మార్చింది. రేణూ దేశాయ్ కొన్ని నెలల క్రితం తాను రెండో పెళ్లి చేసుకోనుందని హింట్ ఇచ్చింది. మళ్ళీ దాని ఊసే ఎత్తలేదు. తాజాగా ఇప్పుడు ఈ వీడియో రేణూ రెండో పెళ్ళి గురించేనా అని వార్తలు గుప్పుమంటున్నాయి. మరి దీనికి రేణుయే సమాధానం చెప్పాలి.
View this post on Instagram



