జబర్దస్త్ కట్టప్పను సన్మానించిన రోజా.. అసలు ఈ సన్మానం ఎందుకు చేసిందో ఎవరికైనా తెలుసా?

జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆ షోలో చేసినవారందరు ఇవాళ హీరోలుగా

  • uppula Raju
  • Publish Date - 12:20 pm, Tue, 22 December 20
జబర్దస్త్ కట్టప్పను సన్మానించిన రోజా.. అసలు ఈ సన్మానం ఎందుకు చేసిందో ఎవరికైనా తెలుసా?

జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆ షోలో చేసినవారందరు ఇవాళ హీరోలుగా, కమెడియన్స్‌గా చెలామణి అవుతున్నారు. అయితే అందులో రాకెట్ రాఘవకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన ప్రత్యేక శైలిలో స్కిట్స్ వేసి అందరిని కడుపుబ్బ నవ్విస్తాడు.

జబర్దస్త్ కామెడీ షోకు ముందు కొన్ని సినిమాలు చేసినా రాఘవకు సరైన గుర్తింపు రాలేదు. తెరపై ఇలా మెరిసి అలా మాయమైపోయే పాత్రలే చేయడంతో రాఘవ అనే ఓ ఆర్టిస్టు ఉన్నాడనే విషయం కూడా జనాలకు తెలియకుండా పోయింది. అలాంటి సందర్భంలో ఆయనకు జబర్దస్త్ షో లైఫ్ ఇచ్చింది. ఇది తన కోసమే వచ్చిందేమో అన్నట్లుగా వాడుకున్నాడు.. తాను ఎదిగాడు.. తనతో పాటు జబర్దస్త్ షోను అప్పుడప్పుడూ తన స్కిట్స్ తో ఎదిగేలా చేసాడు రాఘవ. అయితే జబర్దస్త్ షో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా స్కిట్స్ వేస్తూనే ఉన్నాడు. దీంతో ఇతడికి జబర్దస్త్ కట్టప్ప అనే బిరుదు వచ్చింది. ఏడేళ్లుగా ఒక్క వారం కూడా గ్యాప్ ఇవ్వకుండా షో చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు దాన్ని చేసి చూపించాడు రాఘవ. అందుకే రాకెట్ రాఘవకు 400వ ఎపిసోడ్ సందర్భంగా అందరూ చూస్తుండగానే సన్మానం చేసారు. జబర్దస్త్ జడ్జి రోజా చేతుల మీదుగా ఈయనకు సత్కారం జరిగింది.