RRR: స్ఫూర్తి చాటిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు.. తమ చిత్రానికి రావాల్సిన అవార్డు మరో చిత్రానికి వచ్చినా..

అమెరికాలోలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన 80వ గోల్డెన్‌ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో ట్రిపులార్‌ సినిమా సత్తా చాటిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు..

RRR: స్ఫూర్తి చాటిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు.. తమ చిత్రానికి రావాల్సిన అవార్డు మరో చిత్రానికి వచ్చినా..
RRR Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 13, 2023 | 11:39 AM

అమెరికాలోలోని లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన 80వ గోల్డెన్‌ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో ట్రిపులార్‌ సినిమా సత్తా చాటిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించిన ఈ సినిమా అవార్డుల విషయంలోనూ సత్తా చాటింది. తాజాగా బెస్ట్ ఒరిజినల్.. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి అందుకున్నారు. దీంతో ట్రిపులార్‌ చిత్రం ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది.

ఇదిలా ఉంటే ఈ అవార్డుల ప్రధానోత్సవంలో జరిగిన ఓ సంఘటన మన హీరోలు చాటిన స్ఫూర్తికి కేరాఫ్‌గా నిలిచింది. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో భాగంగా ‘అర్జెంటినా, 1985’ చిత్రానికిగాను ‘నాన్‌ ఇంగ్లిష్‌’ బెస్ట్‌ పిక్చర్‌ క్యాటగిరీలో అవార్డు దక్కింది. సదరు చిత్రానికి అవార్డును ప్రకటించగానే హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నిలబడి చప్పట్లు కొట్టారు. షోలో పాల్గొన్న వారిలో ఇలా స్టాండింగ్‌ ఒవెషన్‌ ఇచ్చింది వీరిద్దరే కావడం విశేషం. అంతేకాకుండా ఈ క్యాటగిరీలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రం కూడా నామినేట్ అయ్యింది. తమ పోటీ చిత్రానికి అవార్డు దక్కినా మన హీరోలు చూపించిన స్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవున్నారు.

ఇవి కూడా చదవండి

ట్రిపులార్‌ మూవీ యూనిట్‌ ఈ వీడియోను ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. బెస్ట్‌ నాన్‌ ఇంగ్లిష్‌ కేటగిరీలో అవార్డు అందుకున్న ‘అర్జెంటినా 1985’ చిత్రానికి శుభాకాంక్షలు తెలిపారు. మీ దేశం మిమ్మల్ని గర్విస్తుంది అంటూ ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు ట్రిపులార్‌ చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమ ప్రత్యర్థి సినిమా అవార్డు అందుకున్న మద్ధతుగా ట్వీట్ చేయడం గ్రేట్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!