AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

 Sandalwood Drugs Case: శాండిల్ వుడ్ డ్రగ్ కేసులో మరో చంచలనం… హీరో వివేక్ ఒబెరాయ్ బావమరిది అరెస్ట్

సుశాంత్ ఆత్మహత్య తర్వాత సినీ పరిశ్రమని మరో సారి డ్రగ్ కేసు కుదిపేస్తోంది. బాలీవుడ్ , టాలీవుడ్, శాండిల్ ఆవుడ్ ఈ వుడ్ అని లేదు.. ప్రతి చోటా డ్రగ్ మాఫియా వేళ్లూనుకుంది. ఎక్కడో చోట సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్న వ్యక్తులు అరెస్ట్ అవుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ బావమరిది..

 Sandalwood Drugs Case: శాండిల్ వుడ్ డ్రగ్ కేసులో మరో చంచలనం... హీరో వివేక్ ఒబెరాయ్ బావమరిది అరెస్ట్
Surya Kala
|

Updated on: Jan 12, 2021 | 5:04 PM

Share

Sandalwood Drugs Case: సుశాంత్ ఆత్మహత్య తర్వాత సినీ పరిశ్రమని మరో సారి డ్రగ్ కేసు కుదిపేస్తోంది. బాలీవుడ్ , టాలీవుడ్, శాండిల్ ఆవుడ్ ఈ వుడ్ అని లేదు.. ప్రతి చోటా డ్రగ్ మాఫియా వేళ్లూనుకుంది. ఎక్కడో చోట సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్న వ్యక్తులు అరెస్ట్ అవుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య అల్వా డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. శాండిల్ వుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆదిత్య ఉన్నారని తెలుస్తోంది. పక్కా సమాచారంతోనే బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

గత నాలుగు నెలల నుంచి ఆదిత్య పరారీలో ఉండగా.. పోలీసులు పక్కా రెక్కీ నిర్వహించారు. సన్నిహితులతో మాట్లాడిన సంభాషణలు, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆదిత్య అల్వాను అరెస్ట్ చేశామని పోలీస్ అధికారులు తెలిపారు. ఆదిత్య డ్రగ్స్ పార్టీలను ఏర్పాటు చేసినట్లు ఆరోపణలున్నాయి. 2020 అక్టోబర్‌లో పోలీసులు బెంగళూరులోని అతని నివాసంపై దాడి చేసి 55 గ్రాముల గంజాయి పొడిని, 3.5 గ్రాముల మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అనేక మంది అరెస్ట్ కాగా ఆదిత్య మాత్రం పరారీలో ఉన్నాడు. అనేక బృందాలు అతని కోసం గాలించారు. అల్వాను దాచిపెట్టారనే అనుమానంతో ముంబై లో వివేక్ ఇంట్లో కూడా పోలీసులు సాధించారు. చివరకి చెన్నై లో అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అరెస్టైన ఆదిత్యను బెంగుళూరుకు తరలించారు. అతడిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు.

ఆదిత్య అల్వా నటుడు వివేక్ ఒబెరాయ్ బావమరిది మాత్రమే కాదు, కర్ణాటకలో రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని దివంగత తండ్రి జీవరాజ్ అల్వా 80 వ దశకంలో మంత్రిగా పనిచేశారు. తల్లి నందిని అల్వా బెంగళూరు సాంస్కృతిక సంస్థలో ప్రముఖ పాత్రను పోషించారు.

Also Read: కరోనాను జయించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. త్వరలో షూటింగ్ లో పాల్గొంటానని ట్వీట్