మహర్షి ఆడియో ఇంత అధ్వాన్నమా.? ఫ్యాన్స్ సెటైర్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ సినిమా వస్తోందంటే.. అభిమానుల్లో భారీస్థాయి అంచనాలు ఉండటం సహజం. వీలైనంతవరకూ ఆ అంచనాలను మహేష్ అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే అన్ని సార్లు అలా అంచనాలను అందుకోవడం వీలు కాదు. తాజాగా ఆయన […]

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ సినిమా వస్తోందంటే.. అభిమానుల్లో భారీస్థాయి అంచనాలు ఉండటం సహజం. వీలైనంతవరకూ ఆ అంచనాలను మహేష్ అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే అన్ని సార్లు అలా అంచనాలను అందుకోవడం వీలు కాదు. తాజాగా ఆయన నటిస్తున్న మహర్షి సినిమాపై అంచనాలను తగ్గించడంలో ఆ సినిమా ఆడియో ఆల్బమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి.
నిన్న మహర్షి జ్యూక్ బాక్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ నుంచి ఇలాంటి యావరేజ్ ఆల్బమ్‌ను ఎవరూ ఊహించలేదు. అదీకూడా మహేష్ బాబు 25వ సినిమా కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక ఈ పాయింట్ తీసుకుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసేవారు ఊరుకుంటారా.? రీసెంట్ గా ఒక నెటిజన్ మహర్షి ఆల్బమ్ పై ఒక ఫన్నీ వీడియో తయారు చేసి ట్వీట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.
అనగనగా ఓ రోజు సినిమా నుంచి ఒక క్లిప్ తీసుకుని ఈ వీడియో తయారు చేశాడు. విలన్ రామిరెడ్డి ఒక టేప్ రికార్డర్ తీసుకొచ్చి కోట శ్రీనివాసరావు ముందు పెడతాడు. అందులో ‘మహర్షి’ సినిమా పాటలు ప్లే అవుతాయి. అవి వినలేక కోటకు పిచ్చకోపం వచ్చి టేప్ రికార్డ్‌ను నేలకేసి కొడతాడు.. అప్పుడు స్టార్ట్ అవుతుంది ‘ఛోటి ఛోటి బాతే’ అంటూ ఆల్బమ్‌లోని చివరి పాట. దాంతో మరింతగా కోపం వచ్చి ఆ టేప్ రికార్డర్‌ను కోట కాలితో కసాబిసా తొక్కుతాడు. ఇందులో రామిరెడ్డిని దేవి శ్రీ ప్రసాద్‌గా.. కోట శ్రీనివాసరావుని మహేష్ ఫ్యాన్స్‌గా మనం అర్ధం చేసుకోవాలి. లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి చూడండి.
#MaharshiJukeBox pic.twitter.com/KlnrcDtEx1
— ? (@Vip_Raghuvaran) April 30, 2019




