AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : అందుకే సినిమాలను వదిలేస్తున్నా… రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో.. ఫ్యాన్స్ ఎమోషనల్..

దక్షిణాది స్టార్ హీరో అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఇకపై తాను సినిమాలు చేయడం లేదని.. ఇండస్ట్రీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ షాకవుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన చివరి సినిమా ఆడియో లాంచ్ వేడుకలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Actor : అందుకే సినిమాలను వదిలేస్తున్నా... రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో.. ఫ్యాన్స్ ఎమోషనల్..
Vijay Thalapathy
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2025 | 12:49 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి క్రేజ్ గురించి తెలిసిందే. దశాబ్దాలుగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. తమిళంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో విజయ్ ఒకరు. కానీ కొన్నాళ్లు రాజకీయాల్లో బిజీగా ఉండడంతో నెమ్మదిగా సినిమాలు తగ్గించేశారు. ఇటీవలే సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించిన విజయ్.. ఇప్పుడు పూర్తిగా ప్రజా సేవకు తన సమయం కేటాయించేందుకు రెడీ అయ్యారు. విజయ్ చివరగా నటిస్తున్న సినిమా జన నాయగన్. ఈ మూవీ తర్వాత తాను ఏ సినిమా చేయనని ప్రకటించారు. శనివారం జరిగిన ఈ మూవీ ఆడియో లాంచ్ వేడుకలో తన రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఇప్పుడు విజయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కౌలాలంపూర్‌లో నిర్వహించిన జన నాయగన్ ఆడియో లాంచ్ వేడుకలో అభిమానుల మధ్యలో విజయ్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రజలకు సేవ చేయడానికే తాను సినిమాను వదులుకుంటున్నానని అన్నారు. డిసెంబర్ 27న బుకిట్ జలీల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని “తలపతి తిరువిళ” (జనరల్ ఫెస్టివల్) గా ప్రకటించారు. అలాగే ప్రతి సందర్భంలో అభిమానులు తనకు ఎంతో మద్దతు ఇచ్చారని అన్నారు.

ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..

విజయ్ మాట్లాడుతూ.. “నేను సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు, నేను ఇక్కడ ఒక చిన్న ఇసుక ఇల్లు కడుతున్నానని అనుకున్నాను. కానీ మీరందరూ నాకు ఒక రాజభవనాన్ని నిర్మించారు. అభిమానులు నాకు ఒక కోట నిర్మించడానికి సహాయం చేసారు… అందుకే నేను వారి తరపున నిలబడాలని నిర్ణయించుకున్నాను” అని నటుడు అన్నారు. “నా కోసం అన్నీ వదులుకున్న అభిమానుల కోసం, నేను సినిమానే వదులుకుంటున్నాను, జీవితంలో విజయం సాధించాలంటే, మీకు స్నేహితులు అవసరం లేకపోవచ్చు, కానీ మీకు బలమైన శత్రువు అవసరం. బలమైన శత్రువు ఉన్నప్పుడే మీరు బలవంతులు అవుతారు. కాబట్టి, 2026 లో, చరిత్ర పునరావృతమవుతుంది. ప్రజల కోసం దానిని స్వాగతించడానికి మనం సిద్ధంగా ఉందాం” అని అన్నారు.

Vijay Thalapathy News

Vijay Thalapathy News

హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన జన నాయగన్‌ చిత్రంలో బాబీ డియోల్, మమిత బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి తారలు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను జనవరి 9, 2026న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది విజయ్ దళపతి నటించే ఆఖరి సినిమా.

ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‏గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.

సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా