Sai Pallavi: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్.. ఉత్తమ నటిగా సాయి పల్లవి.. ఏ పాత్రకో తెలుసా..

న్యాచురల్ బ్యూటీగా తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. సహజ నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ.. ఉత్తమ నటిగా ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ అందుకుంది. తాజాగా మరోసారి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ సొంతం చేసుకుంది.

Sai Pallavi: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్.. ఉత్తమ నటిగా సాయి పల్లవి.. ఏ పాత్రకో తెలుసా..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 20, 2024 | 1:48 PM

తమిళ చిత్ర పరిశ్రమ ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గురువారం సాయంత్రం వేడుకగా జరిగింది. తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఫిల్మ్ రివ్యూ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా ఈ వేడుకను అంగరంగా వైభవంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు సందడి చేశారు. ఇందులో అమరన్ సినిమాలో ఇందు రెబెకా వర్గీస్ పాత్రకుగానూ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది సాయి పల్లవి. అలాగే మహారాజా సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నాడు విజయ్ సేతుపతి. ఈ వేడుకలను చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. చెన్నైలో గత 22 ఏళ్లుగా ఈ ఉత్సవం జరుగుతోంది. తమిళంలో విడుదలైన ప్రధాన చిత్రాలే కాకుండా ప్రపంచ భాషల్లో విడుదలైన అనేక చిత్రాలు కూడా ప్రదర్శిస్తారు.

ఈ ఏడాదికి సంబంధించిన ఫిల్మ్ ఫెస్టివల్ 12న ప్రారంభమై 19వ తేదీ వరకు కొనసాగింది. ఈ ఫెస్టివల్‌లో దాదాపు 180 సినిమాలు ప్రదర్శించారు. ఇందులో అమరన్ సినిమాకు ఉత్తమ నటిగా సాయి పల్లవి.. మహారాజా సినిమాకు ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి అవార్డ్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ.. “22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా అవార్డ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది ఎన్నో గొప్ప సినిమాలు విడుదలయ్యాయి. అందులో నన్ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. నాపై అభిమానులు చూపించే ప్రేమ నన్నెంతో భావోద్వేగానికి గురి చేస్తుంటుంది. ముకుంద్ కుటుంబసభ్యులు, ఆయన భార్య వల్లే ఇది సాధ్యమైంది. దేశం కోసం నిరంతరం శ్రమిస్తోన్న ఒక జవాను కథ ఇది. రాజ్ కుమార్ పెరియాసామి వంటి దర్శకులే ఇలాంటి కథలను మనకు అందించగలరు ” అంటూ చెప్పుకొచ్చింది.

చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలు వీరే..

  • ఉత్తమ చిత్రం : అమరన్
  • రెండో చిత్రం : లబ్బర్ పందు
  • ఉత్తమ నటుడు : విజయ్ సేతుపతి (మహారాజా)
  • ఉత్తమ నటి : సాయి పల్లవి (అమరన్)
  • ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సీహెచ్ సాయి (అమరన్)
  • ఉత్తమ ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్ (అమరన్)
  • ఉత్తమ బాలనటుడు : పొన్నెల్ (వాళై)
  • ఉత్తమ సహాయనటుడు : దినేశ్ (లబ్బర్ పందు)
  • ఉత్తమ సహాయ నటి : దుషారా విజయన్ (వేట్టయన్)
  • ఉత్తమ రచయిత : నిథిలన్ సామినాథన్ (మహారాజా)
  • ఉత్తమ సంగీత దర్శకుడు : జీవీ ప్రకాష్ (అమరన్)
  • స్పెషల్ జ్యూరీ అవార్డ్ : మారి సెల్వరాజ్ (వాళై), పా. రంజిత్ (తంగలాన్)

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.