మెగా టైటిల్ తో విజయ్ కొత్త చిత్రం..!

సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ తన కొత్త చిత్రం ఆనంద్ అన్నామలై అనే నూతన దర్శకుడుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఏప్రిల్ 22 న ఢిల్లీలో మొదలు కానుందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వినికిడి. ఇలా ఉంటే ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. తెలుగు, తమిళ,మలయాళం మరియు కన్నడ భాషల్లో […]

  • Updated On - 10:10 am, Wed, 13 March 19
మెగా టైటిల్ తో విజయ్ కొత్త చిత్రం..!

సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ తన కొత్త చిత్రం ఆనంద్ అన్నామలై అనే నూతన దర్శకుడుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఏప్రిల్ 22 న ఢిల్లీలో మొదలు కానుందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వినికిడి. ఇలా ఉంటే ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్.

తెలుగు, తమిళ,మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. క్రీడా నేపథ్యంతో రూపొందే ఈ చిత్రంలో విజయ్ ప్రొఫెషనల్ బైకర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్