వాళ్లు రోజు దాటే గీత.. మనం ఒక్కసారి దాటితే..
వాళ్లు రోజు దాటే గీత మనం.. ఒక్కసారి దాటితే ఎలా ఉంటుదో చూపిస్తామంటున్నాడు చైతూ. విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్యలు మల్టీస్టారర్‌లుగా.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వెంకీమామ. నిజ జీవితంలో మామ అల్లుళ్ళు అయిన విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్య.. ఇప్పుడు రీల్ లైఫ్‌లో కూడా అదే వరుసలయ్యే పాత్రలో సినిమాలో నటిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా రిలీజ్ కోసం.. అటు వెంకీ ఫ్యాన్స్, చైతూ ఫ్యాన్స్ అంతా […]

వాళ్లు రోజు దాటే గీత మనం.. ఒక్కసారి దాటితే ఎలా ఉంటుదో చూపిస్తామంటున్నాడు చైతూ. విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్యలు మల్టీస్టారర్‌లుగా.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వెంకీమామ. నిజ జీవితంలో మామ అల్లుళ్ళు అయిన విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్య.. ఇప్పుడు రీల్ లైఫ్‌లో కూడా అదే వరుసలయ్యే పాత్రలో సినిమాలో నటిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా రిలీజ్ కోసం.. అటు వెంకీ ఫ్యాన్స్, చైతూ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ వెంకీమామ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇటు క్లాస్.. అటు మాస్ ఆడియన్స్ అందర్నీ ఆకర్షించేలా ట్రైలర్‌ని కట్ చేశారు.
ఇక స్క్రీన్ పైన మామా అల్లుళ్లుగా.. వెంకీ, చైతూలు అదరగొట్టారు. కుటుంబ నేపథ్యంతో పాటు మాస్ అంశాలను కూడా బాగానే స్కీన్‌మీదకెక్కించాడు బాబీ. ముఖ్యంగా ఈ ట్రైలర్‌లోని డైలాగ్స్ అదురిపోతున్నాయి. స్టార్టింగ్‌లోనే.. వెంకీ డైలాగ్ పేలిపేయింది. “మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని నీ నమ్మకం”.. “ఆ రాతను తిరిగిరాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం”.. అంటూ వెంకీ డైలాగ్ అదిరిపోయింది. ఆ తర్వాత నీ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు మామయ్యా.. అది నీ వల్ల కూడా కాదు.. ఈ సారి జాతరను రంగులతో కాదు.. మీ రక్తంలో ఎరుపెక్కిస్తాను.. రండ్రా నా కొడకల్లారా.. వాళ్లు రోజూ దాటే గీత మనం ఒక్కసారి దాటితే ఎలా ఉంటుందో చూపించి వస్తాను సర్.. అంటూ పవర్ ఫుల్ డైలాగులు ఈ టీజర్‌లో వినిపించాయి. ఇక ఈ సినిమాలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. భారీ అంచనాలతో.. ఈ చిత్రం డిసెంబర్ 13న విడుదల కానుంది.



