Venkatesh Daughter Ashritha: ప్రేమ, పెళ్లి , ఫ్యామిలీ, అభిరుచులను నెటిజన్లతో పంచుకున్న హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత
టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారు అన్నసంగతి అందరికీ తెలిసిందే. కుమారుడు అర్జున్ .. గోపాల గోపాల సినిమాలో తండ్రి కి కొడుకుగా నటించాడు.. ఇక కుమార్తెలు చాలా అరుదుగా కనిపిస్తారు అభిమానులకు. ఇక పెద్ద కుమార్తె ఆశ్రిత పెళ్లి..
Venkatesh Daughter Ashritha: టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారు అన్నసంగతి అందరికీ తెలిసిందే. కుమారుడు అర్జున్ .. గోపాల గోపాల సినిమాలో తండ్రి కి కొడుకుగా నటించాడు.. ఇక కుమార్తెలు చాలా అరుదుగా కనిపిస్తారు అభిమానులకు. ఇక పెద్ద కుమార్తె ఆశ్రిత పెళ్లి హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో జరిగింది. ఈ జంట ప్రస్తుతం విదేశాల్లో ఉంటుంది.. అయితే ప్రొఫెసనల్ బేకర్ అయిన ఆశ్రిత Infinity Platter పేరుతో సోషల్ మీడియాలో ఓ అకౌంట్ ను మెయింటేన్ చేస్తోంది.
ఈ అకౌంట్ ద్వారా అభిమానులకు డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్ ను పరిచయం చేస్తోంది. అయితే తాజాగా కొంతమంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆశ్రిత సమాధానం ఇచ్చింది. ఒక నెటిజన్ మీది లవ్ మ్యారేజ్ అట కదా అని అడిగిన ప్రశ్నకు ఆశ్రిత స్పందించింది.. అవును తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది ఆశ్రిత.. అంటకాదు తాను, తన భర్త ఒకే స్కూల్ లో చదువుకున్నామని ఇద్దరికీ అప్పటి నుంచి పరిచయం ఉందని తెలిపింది, ఇక మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. తనకు కాఫీ అంటే చాలా ఇష్టమని అయితే ఎక్కువ ఎసిడిటీ ఇస్తుంది కనుక తాగను అని చెప్పింది.. ఇక రానా భార్య మిహికా అంటే ఇష్టమని తెలిపింది మరో ప్రశ్నకు బదులు.. అంతేకాదు తాను ఇప్పటి వరకూ మేకప్ వేసుకోలేదని.. అయితే త్వరలో ఓ ప్రాజెక్ట్ తో రాబోతున్నాను.. అందుకనే సింపుల్ గా ఉంటూ.. నేచురల్ గా కనిపించే మేకప్ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటున్నానని తెలిపింది వెంకటేష్ ముద్దుల తనయ ఆశ్రిత.
Also Read: