Rashmika Mandanna: సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. రష్మిక మందన్న పోస్ట్ వెనుక అర్థం ఏంటబ్బా..?
సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవటంలోనే కాదు... సోషల్ మీడియా అటెన్షన్ గ్రాబ్ చేయటంలోనూ బెస్ట్ అనిపించుకుంటున్నారు రష్మిక మందన్న.
Rashmika Mandanna: సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవటంలోనే కాదు… సోషల్ మీడియా అటెన్షన్ గ్రాబ్ చేయటంలోనూ బెస్ట్ అనిపించుకుంటున్నారు రష్మిక మందన్న. ఈ జనరేషన్ హీరోయిన్‌లు న్యూస్‌లో కనిపించేందుకు నానా తంటాలు పడుతుంటే.. రష్మిక మాత్రం ఒక్క క్లిక్‌తో సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తున్నారు. కావాలంటే పైన పిక్ చూడండి… సింగిల్ ఫోటోతో సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారో.!
ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన రష్మిక ఎదురుగా ఖాళీగా ఉన్న బౌల్స్ తో ఓ ఫోటో దిగి.. దాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంతేకాదు ఈ పిక్‌తో పాటు ఇవన్నీ నేను ఒక్కదాన్నే తినలేదు.. అంటూ ఓ ఫీలర్ వదిలారు. మరి రష్మికతో పాటు రెస్టారెంట్‌కు వెళ్లిన ఆ రెండో పర్సన్ ఎవరు..? ఈ విషయం మీదే ఆరాలు మొదలు పెట్టారు ఫ్యాన్స్. దీంతో రష్మిక పోస్ట్ వైరల్‌గా మారింది.
View this post on Instagram
ఈ పిక్‌ను దాదాపు 23 లక్షల మంది లైక్ చేశారంటేనే ఆ పిక్ ఏ రేంజ్‌లో వైరల్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రజెంట్ బాలీవుడ్ డెబ్యూ మిషన్ మజ్ను షూటింగ్‌లో బిజీగా ఉన్న రష్మిక మరో వారం రోజుల్లో పుష్ప టీంతో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ బ్యూటీ తమిళ్‌లో నటించిన సుల్తాన్, కన్నడలో చేసిన పొగరు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.
Also Read: