Actress Raasi :కోటీశ్వరులు వచ్చినా కాదని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్..
అచ్చతెలుగమ్మాయి రాశి.. 90వ దశకంలో హీరోయిన్ గా ఓ రేంజ్ లో క్రేన్ ను సొంతం చేసుకుందీ సొట్టబుగ్గల సుందరి. హీరోయిన్ గా అడుగు పెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలోనే 50సినిమాల్లో నటించింది.. ఎంత తర్వగా కెరీర్ లో ఎదిగిందో...
Senior Actress Raasi : అచ్చతెలుగమ్మాయి రాశి.. 90వ దశకంలో హీరోయిన్ గా ఓ రేంజ్ లో క్రేన్ ను సొంతం చేసుకుందీ సొట్టబుగ్గల సుందరి. హీరోయిన్ గా అడుగు పెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలోనే 50సినిమాల్లో నటించింది.. ఎంత తర్వగా కెరీర్ లో ఎదిగిందో.. అంతే త్వరగా స్క్రీన్ నుంచి కనుమరుగైపోయింది చిన్నది.
బాలకృష్ణ నటించిన బాలచంద్రుడు సినిమాలో కళ్యాణ్ రామ్ తో పాటు రాశి కూడా బాలనటిగా నటించింది. తర్వాత అనేక సినిమాల్లో బాలనటిగా నటించి అలరించింది..బదిలీ సినిమాతో టాలీవుడు లో హీరోయిన్ గా అడుగు పెట్టినా 1997లో హీరోయిన్ గా జగపతిబాబు శుభాకాంక్షలు తో సూపర్ హిట్ అందుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.. చిత్ర పరిశ్రమలో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది రాశి.. అయితే బాలయ్యబాబుతో కృష్ణ బాబు సినిమాలో రాశి హీరోయిన్ గా నటించడం విశేషం.
పవన్ కళ్యాణ్ గోకులంలో సీత, జగపతిబాబు పెళ్లి పందిరి, శ్రీకాంత్ ప్రేయసి రావే వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా శ్రీకాంత్ కాంబినేషన్‌లో ఈమె చేసిన సినిమాలు సంచలన విజయం సాధించాయి. స్టార్ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలో దశాబ్ధం పాటు చక్రం తిప్పింది రాశి. స్టార్ హీరోయిన్ రేంజ్ కు దగ్గరగా వచ్చి సడెన్ గా ఫెడ్ అవుట్ అయిపోయింది.. ఒకానొక సమయంలో ఐటెం సాంగ్స్ తో పాటు వాంప్ పాత్రల్లో కూడా రాశి కనిపించింది అభిమానులకు షాక్ ఇచ్చింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన రాశి ఇటీవల తన ఫ్యామిలీ గురించి ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించింది. తన ప్రేమ పెళ్లి గురించి ప్రేక్షకులతో పంచుకుంది. తనను అప్పట్లో పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వరులు క్యూలో నిలడ్డారని.. అయితే వాళ్లందరినీ కాదని తాను ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్నానని చెప్పింది.
అతని పేరు శ్రీముని.. రాశి నటించిన కొన్ని సినిమాలకు ఆయన సహాయక దర్శకుడిగా పని చేశాడు. అప్పుడే వాళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. అదే సమయంలో రాశీ తండ్రి చనిపోవడంతో ఆమెతో మరింత చేరువయ్యాడు శ్రీముని. రాశికి అన్నివిధాలా అండగా నిలడ్డాడు.. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది.. ఇక తానే ముందుగా శ్రీముని కి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశానని రాశి చెప్పింది. శ్రీముని కూడా ఒకే అనడంతో.. రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని తెలిపింది రాశి.. ఈ దంపతులకు ఒక చిన్నారి కూతురు పుట్టింది. చాలా కాలం తర్వాత ఇటీవలే లంక సినిమాతో రాశి రీ ఎంట్రీ ఇచ్చింది.. కెరీర్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి మళ్ళీ అవకాశాలను అందుకుంటుంది.
Also Read: