Karthikeya: ‘ఆర్ఎక్స్100’ హీరో డెడికేషన్ ఎలా ఉందో చూశారా.. వైరల్‌గా మారిన కార్తికేయ ఫొటోలు..
Karthikeya Photos Goes Viral: ‘ప్రేమతో మీ కార్తిక్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు హీరో కార్తికేయ. అయితే ఈ సినిమాతో ఫేమ్ సంపాదించుకోని కార్తికేయ అనంతరం వచ్చిన ‘ఆర్ఎక్స్100’ ఒక్కసారిగా...
Karthikeya Photos Goes Viral: ‘ప్రేమతో మీ కార్తిక్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు హీరో కార్తికేయ. అయితే ఈ సినిమాతో ఫేమ్ సంపాదించుకోని కార్తికేయ అనంతరం వచ్చిన ‘ఆర్ఎక్స్100’ ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో తన అద్భుత నటనతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడీ యంగ్ హీరో. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కార్తికేయకు ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ‘ఆర్ఎక్స్100’ తర్వాత వచ్చిన ఏ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా ఓ క్రేజీ చిత్రంలో నటిస్తున్నాడీ యంగ్ హీరో. మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతోన్న ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటిస్తున్నాడు కార్తికీయ. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఇక తాజాగా ఈ యంగ్ హీరో ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సిక్స్‌ప్యాక్‌లో కనిపించిన కార్తికేయ అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురిచేశాడు. ‘ఈ అందమైన యంత్రాన్ని (మీ శరీరాన్ని) నమ్మండి. మీ సామర్థ్యం ఏంటో అది ప్రపంచానికి చూపిస్తుంది. నా జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేతి దీనిని సాకారం చేశాడు’ అంటూ క్యాప్షన్ జోడిచ్చాడీ యంగ్ హీరో. తన డెడికేషన్‌తో తక్కువ సమయంలోనే సిక్స్ ప్యాక్‌కు మారిన కార్తికేయను పొగుడుతూ ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కార్తికేయ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
Believe in this beautiful machine called your body and it will show you what you are capable of..@kuldepsethi (my super trainer) made this possible pic.twitter.com/hb8qinaN7E
— Kartikeya (@ActorKartikeya) February 16, 2021
Also Read: AP Panchayat Elections 2021 live: ఏపీలో కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికలు.. ఉదయం 9.30 గంటలకు 30 శాతం పోలింగ్. Vijay Sethupathi Busy in Tollywood Video: టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకున్నటున్న మక్కల్ సెల్వన్..