Uday Kiran: ఆ హీరో చనిపోయి అప్పుడే ఏడేళ్లు గడిచాయి.. మెరుపులా వచ్చి స్టార్‌లా ఎదిగారు కానీ..
Uday Kiran: ఆ హీరో చనిపోయి అప్పుడే ఏడేళ్లు గడిచాయి.. మెరుపులా వచ్చి స్టార్‌లా ఎదిగారు కానీ..ఉదయ్ కిరణ్ చనిపోయి అప్పుడే ఏడేళ్లు
Uday Kiran: ఆ హీరో చనిపోయి అప్పుడే ఏడేళ్లు గడిచాయి.. మెరుపులా వచ్చి స్టార్‌లా ఎదిగారు కానీ..ఉదయ్ కిరణ్ చనిపోయి అప్పుడే ఏడేళ్లు గడిచిందంటే ప్రేక్షకులు నమ్మడం లేదు. ఎందుకంటే ఆయన సినిమాలు అలాంటివి. ఇప్పటికి టీవీలో అతడి సినిమా వస్తుంటే అభిమానులు ఎంతో ఇష్టంగా చూస్తారు. కానీ అతడు లేడని తెలిస్తే మాత్రం ఎవ్వరూ నమ్మడం లేదు.
ఇండస్ట్రీలోకి ఒక మెరుపులా వచ్చి స్టార్‌గా ఎదిగి ఎన్నో విజయాలను చవిచూసి అంతలోనే కనుమరుగైపోయాడు.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా 2000 ఏడాదిలో చిత్రం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు ఉదయ్ కిరణ్. ఆ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని నువ్వు నేను అంటూ వచ్చాడు. అది బ్లాక్ బస్టర్.. కోటి పెట్టి తీస్తే 14 కోట్లు వసూలు చేసింది నువ్వు నేను. ఆ వెంటనే మనసంతా నువ్వే మరో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్. ఈ సినిమా అప్పట్లోనే 19 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ మూడు విజయాలతో ఉదయ్ కిరణ్ సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు. 22 ఏళ్లకే సూపర్ స్టార్ అయిపోయిన ఉదయ్ పాతికేళ్లకే వచ్చిన క్రేజ్ మొత్తం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కనీసం ఈయన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఓ రకంగా ఇండస్ట్రీ ఉదయ్ కిరణ్‌ను పూర్తిగా పట్టించుకోలేదని చెప్పాలి. మానసిక ఒత్తిడితోనే 2014, జనవరి 5న తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.