AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్‌ సేతుపతి కుమార్తెకు అత్యాచార బెదిరింపు

వరుస విమర్శల నేపథ్యంలో శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్ 800 నుంచి కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్న విషయం తెలిసిందే.

విజయ్‌ సేతుపతి కుమార్తెకు అత్యాచార బెదిరింపు
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 20, 2020 | 12:30 PM

Share

Vijay Sethupathi Daughter: వరుస విమర్శల నేపథ్యంలో శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్ 800 నుంచి కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అధికారిక ప్రకటన ఇచ్చారు. మురళీధరన్ కోరిక మేరకు ఈ బయోపిక్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు సేతుపతి ఆ ప్రకటనలో వెల్లడించారు. అయితే ఈ మూవీ నుంచి తప్పుకున్నప్పటికీ, ఆయనపై ఆగ్రహావేశాలు చల్లారలేదు. అతడిని కించపరుస్తూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంక నెటిజన్ అయితే సేతుపతి కుమార్తెను అత్యాచారం చేస్తామంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు. రిత్విక్ అనే పేరుతో ఉన్న ఓ నెటిజన్‌.. విజయ్‌ సేతుపతి కుమార్తె అత్యాచారానికి గురైతే తప్ప శ్రీలంకలో తమిళులు పడ్డ బాధ అతడికి తెలీదు అని కామెంట్ పెట్టాడు.

దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. అతడిని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ బెదిరింపులు ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఎంకే ఎంపీలు కనిమొళి, ఎస్ సెంథిల్ కుమార్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా సోషల్ మీడియాలో స్పందించారు. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాము. దీనిపై చర్యలు తీసుకోండి. అతడిని అరెస్ట్ చేయండి అని వారు తమిళనాడు ప్రభుత్వం, చెన్నై పోలీసులకు ట్యాగ్ చేశారు. కాగా చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌ ధోని కుమార్తె జీవాకు కూడా ఇటీవల ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే. చెన్నై టీమ్ ఓడిపోగా.. ధోని సరిగా ఆడకపోతే జీవాను రేప్ చేస్తామంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఆ అకౌంట్‌ని ట్రాక్ చేసిన పోలీసులు ఇటీవల నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇది జరిగి రోజులు కూడా గడవకముందే విజయ్ సేతుపతి కుమార్తెకూ అలాంటి బెదిరింపులు రావడం నిజంగా బాధించదగ్గ విషయం.

Follow Us
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో