TV9 Bangla Ghorer Bioscope Awards 2023: శనివారం ఎంతో అట్టహాసంగా జరిగిన టీవీ9 బంగ్లా ఘోరర్ బయోస్కోప్ అవార్డ్స్ 2023 కార్యక్రమానికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా వచ్చారు. బెంగాలీ టెలివిజన్, ఓటీటీ పరిశ్రమలోని కళాకారులను సత్కరించేందుకు TV9 బంగ్లా ఘోరర్ బయోస్కోప్ అవార్డ్స్ 2023 వేడుకను టీవీ9 బంగ్లా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. అయితే మొట్టమొదటి టీవీ సెట్ ఆవిష్కరణను జాన్ లోగీ బైర్డ్ 1923 జనవరిలో ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1926 నాటికి తొలి టీవీసెట్ ప్రదర్శనను చేశారు. ఆ ఆవిష్కరణ 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా TV9 బంగ్లా ఘోరర్ బయోస్కోప్ అవార్డ్స్ 2023 వేడుకను జరుపుతుంది. ఈ మేరకు టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరున్ దాస్ కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులందరికీ ముందుగా స్వాగతం పలికారు.
ఆయన మాట్లాడుతూ ‘ఈ టీవీ సెట్ ప్రతి ఇంటికి చేరుకుంది. ఆ కారణంగానే దానికి సాఫ్ట్ పవర్ ఎక్కువగా ఉంది. సాఫ్ట్ పవర్ అంటే బలవంతం చేయకుండా ఆకర్షణ లేదా ఒప్పించడం ద్వారా ఇతరులను ప్రభావితం చేయడమని అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ జోసెఫ్ నై పేర్కొన్నారు. సాఫ్ట్ పవర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బ్రెయిన్ వాష్ చేయడం.
టీవీలు కూడా అంతే కదా.. మనల్ని బలవంతం చేయకుండానే మనల్ని ప్రభావితం చేస్తాయి. నిజానికి సాఫ్ట్ పవర్ అనేది టీవీ ఆవిష్కరణ కంటే మునుపే వాడుకలో ఉంది. ఎలా అంటే 16వ శతాబ్దం నాటి ఐరోపాలో చర్చికి, ప్రజలకు మధ్య వివాదం రేగింది. అప్పుడు చర్చి ప్రజలను ప్రభావితం చేయడానికి వీధి నాటకాలను ఉపయోగించింది. ప్రచ్ఛన్న యుద్ధ యుగంలో కమ్యూనిజంపై యుద్ధంలో అమెరికన్ సినిమా శక్తివంతమైన సాధనంగా మారింది. సోవియట్ యూనియన్‌ను మూలన పడేయడానికి కూడా అమెరికన్ సినిమా ముఖ్యమైన పాత్ర పోషించింది.
ఇటీవల వచ్చిన జూబ్లీ వెబ్ సిరీస్ USSR(రష్యా యూనియన్) , అమెరికా తమ కథనాలను నడపడానికి హిందీ చిత్ర పరిశ్రమను ఎలా నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయో చూపిస్తుంది. అయితే ఈ సాఫ్ట్ పవర్‌కి మరోక వైపు ఉంది. నా అభిప్రాయం ప్రకారం కళ అనేది ఒక అరుదైన మానవ నిర్మిత భావనలను ఏకం చేస్తుంది. నాకు భాష, మతం, రాజకీయాలు, అన్నీ వేర్వేరు. భాషకు, మతానికి అతీతంగా- రాజకీయాలకు అతీతంగా, ప్రతిదానికీ అతీతంగా కళ ద్వారా మాత్రమే ప్రపంచం ఏకమవుతుంది. కాబట్టి శక్తివంతమైన సాఫ్ట్ పవర్, ఏకీకృత సామర్థ్యం కలయికతో చలనచిత్రం, వినోదం జీవితాన్ని ఏ మేరకు ఉన్నతీకరించగలవు.! ఏదో ఒక రోజు ఈ బెంగాల్ మళ్లీ దేశాన్ని నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. ‘ఈ రోజు బెంగాల్ ఏమి ఆలోచిస్తుందో, దాన్ని భారతదేశం రేపు ఆలోచిస్తుంది’ అని ఆశిస్తూ నేను మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాను’’ అని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం..