Pooja Hegde: ఆ స్టార్ హీరోల సినిమాలను పూజా హెగ్డే వదులుకుందా..? లేక..
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ ముద్దుగుమ్మ. దాదాపు టాలీవుడ్ లో అగ్ర హీరోలందరితో నటించి మెప్పించింది.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో పూజ హెగ్డే ఒకరు. తమిళ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ భామ తెలుగులో స్టార్ హీరోయిన్ గామారిపోయింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ ముద్దుగుమ్మ. దాదాపు టాలీవుడ్ లో అగ్ర హీరోలందరితో నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఆకట్టుకోలేకపోతున్నాయి. సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. అయితే పూజ హెగ్డే పలు సినిమాలను వదులుకుందని తెలుస్తోంది.
అయితే పూజా హెగ్డే వదులుకుందో లేక మరో కారణం ఉందో ఏమో తెలియదు కానీ కొని స్టార్ హీరోల సినిమాలు మిస్ చేసుకుంది ఈ చిన్నది. ఈ అమ్మడు మిస్ చేసుకున్న సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.
ఈ సినిమాలో హీరోయిన్ పూజాహెగ్డే అంటూ గతంలో పలు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. పవన్ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఫిక్స్ చేశారు హరీష్. అలాగే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన అనే సినిమా అనౌన్స్ చేసినప్పుడు హీరోయిన్ గా పూజాహెగ్డేను ఎంపిక చేశారు. కానీ ఈ సినిమా ఆగిపోయింది. అలాగే విజయ్ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో ముందుగా పూజా ను హీరోయిన్ గా అనుకున్నారట. కానీ లాస్ట్ మినిట్ లో మృణాల్ ఠాకూర్ ను ఫిక్స్ చేశారట. అయితే ముందుగా పూజకు ఆఫర్ వచ్చిందట. అయితే పాత్ర నడివి తక్కువ ఉండటంతో ఆమె నో చెప్పిందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం పూజ చేతిలో ఉన్న సినిమా మహేష్ బాబు గుంటూరు కారం ఒకటి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. అయితే ఈ సినిమాలోనూ శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.