AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Comments: మన్సూర్ ‘బెడ్ రూం సీన్’ వ్యాఖ్యలపై స్పందించిన త్రిష.. ట్వీట్ వైరల్

త్రిష రెండక్షరాల అందాల తార. సినిమా కెరియర్ లో మొదటి ఇన్నింగ్స్ కంటే కూడా సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఇటీవల విడుదలైన లియో సినిమాలో విజయ్ సరసన నటించి మంచి టాక్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 550కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించిన నటుడు మన్సూర్ అలీ ఖాన్.. నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Trisha Comments: మన్సూర్ 'బెడ్ రూం సీన్' వ్యాఖ్యలపై స్పందించిన త్రిష.. ట్వీట్ వైరల్
Trisha Responds To Mansoor Ali Khan's Comments On X Platform
Srikar T
|

Updated on: Nov 19, 2023 | 9:02 AM

Share

త్రిష రెండక్షరాల అందాల తార. సినిమా కెరియర్ లో మొదటి ఇన్నింగ్స్ కంటే కూడా సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఇటీవల విడుదలైన లియో సినిమాలో విజయ్ సరసన నటించి మంచి టాక్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 550కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించిన నటుడు మన్సూర్ అలీ ఖాన్.. నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలు..

మన్సూర్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ‘లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని తెలిసి నేను కూడా ఈ సినిమాలో నటించా. ఈ సినిమాలో ఒక్క బెడ్‌రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నా. నేను ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను కూడా బెడ్‌రూమ్‌కు తీసుకెళ్తానని భావించా. ఇంతకు ముందు సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను. సినిమాల్లో ఇది నాకు కొత్త కాదు. కానీ ఈ చిత్రం కశ్మీర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్‌లో త్రిషను కనీసం నాకు చూపించలేదు.’ అంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

వ్యాఖ్యలపై పలువురి స్పందన..

ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై లియో సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించారు. మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈయనతోపాటూ ఇతర నటీమణులు కూడా తీవ్రంగా ఖండించారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అతని వ్యాఖ్యలు చూసిన నెటిజన్లు ఇలాంటి వారికి సినిమా అవకాశాలు ఎందుకు ఇస్తారు అంటూ కామెంట్స్ చేశారు.

మన్సూర్ వ్యాఖ్యలపై త్రిష స్పందన..

ఇదిలా ఉంటే మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై నటి త్రిష స్పందించారు. ‘ మన్సూర్ అలీఖాన్ లియో సినిమాలో నాతో పాటూ నటించారు. ఆయన నా గురించి అసభ్యకరంగా మాట్లాడినట్లు ఓ వీడియో నా దృష్టికి వచ్చింది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అతను మాట్లాడిన మాటలు స్త్రీని ద్వేషిస్తూ, అగౌరవపరుస్తూ, చెడుగా చూపిస్తున్నట్లు ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వ్యక్తితో కలిసి నటించినందుకు గొప్పగా ఫీలవుతున్నాను. అయితే రానున్న రోజుల్లో ఇతనితో కలిసి నటించేందుకు సిద్దంగా లేను. కలిసి నటించకుండా ఉండేలా చూసుకుంటాను అని ధీటైన సమాధానం ఇచ్చారు. సమాజంలో ఇలాంటి వాళ్ల వల్లే మనుషులకు చెడ్డపేరు వస్తుందని తన ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..