- Telugu News Photo Gallery Cinema photos Lavanya Tripathi First post about her husband varun tej after marriage telugu movie news
Lavanya Tripathi: పెళ్లి తర్వాత తొలిసారి భర్త గురించి లావణ్య పోస్ట్.. వరుణ్ రియాక్షన్ ఏంటంటే..
నవంబర్ 1న పెళ్లి వేడుకతో ఒకటయ్యారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. దాదాపు ఏడేళ్ల వీరి ప్రేమ.. ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత హైదరాబాద్, డెహ్రాడూన్ లో రిసెప్షన్స్, దీపావళీ వేడుకలతో బిజీగా ఉన్న లావణ్య.. తాజాగా ఇన్ స్టా వేదికగా తన భర్త వరుణ్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. తన పెళ్లి వేడుకలోని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోస్ షేర్ చేసింది. లావణ్య పోస్ట్‌కు లవ్ ఎమోజీని షేర్ చేశాడు వరుణ్.
Updated on: Nov 18, 2023 | 10:13 PM

నవంబర్ 1న పెళ్లి వేడుకతో ఒకటయ్యారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. దాదాపు ఏడేళ్ల వీరి ప్రేమ.. ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత హైదరాబాద్, డెహ్రాడూన్ లో రిసెప్షన్స్, దీపావళీ వేడుకలతో బిజీగా ఉన్న లావణ్య.. తాజాగా ఇన్ స్టా వేదికగా తన భర్త వరుణ్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. తన పెళ్లి వేడుకలోని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోటోస్ షేర్ చేసింది.

" నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన, దయగల, కేరింగ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు నా భర్త!.. నేను చెప్పడానికి చాలా ఉంది, కానీ వాటన్నింటిని మనసులోనే దాచుకుంటాను. ..మా కుటుంబాలు, ప్రియమైనవారి మధ్య మా మూడు రోజుల పెళ్లి జరిగింది. మా కల నెరవేరింది. ఈ రోజును చాలా ప్రత్యేకంగా చేసిన ప్రతి ఒక్కరికీ, మాకు శుభాకాంక్షలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అంటూ పెళ్లి ఫోటోస్ షేర్ చేసింది.

లావణ్య పోస్ట్‌కు లవ్ ఎమోజీని షేర్ చేశాడు వరుణ్. ప్రస్తుతం లావణ్య పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. వీరిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. అంతేకాకుండా వీరిద్దరి పెళ్లి ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

2017లో విడుదలైన మిస్టర్ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైనట్లుగా తెలుస్తోంది. దాదాపు ఆరేడేళ్ల తర్వాత వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.




