Cinema: మీరు సినిమాలు, సీరియల్స్ కు కథలు రాస్తారా? హైదరాబాద్‌లో జీ రైటర్స్ రూమ్ ఆడిషన్స్.. పూర్తి వివరాలివే

మీరు కథలు బాగా రాస్తారా. స్క్రీన్ అండ్ స్క్రిప్ట్ రైటర్లుగా సినిమా ఇండస్ట్రీలో స్థిర పడాలనుకుంటున్నారా? అయితే జీ ఎంటర్ టైన్మెంట్స్ మీకో సువర్ణావకాశం కల్పించింది. ఔత్సాహిక రచయితల కోసం హైదరాబాద్ లో ఓ చక్కని వేదికను ఏర్పాటు చేసింది. మరెందుకు ఆలస్యం.. వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

Cinema: మీరు సినిమాలు, సీరియల్స్ కు కథలు రాస్తారా? హైదరాబాద్‌లో జీ రైటర్స్ రూమ్ ఆడిషన్స్.. పూర్తి వివరాలివే
ZEE Writers Room Auditions

Updated on: Aug 28, 2025 | 9:10 PM

ఆసక్తికరమైన, ఆలోచనలు రేకెత్తించే కథలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఔత్సాహిక రచయితలకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. జీ రైటర్స్ రూమ్ కేవలం ప్రతిభను వెలికితీసే ప్రయత్నం మాత్రమే కాదు—ఇది ‘యువర్స్ ట్రూలీ Z’ అనే కంపెనీ బ్రాండ్తో ప్రారంభమైన ఒక సృజనాత్మక ఉద్యమం. ఈ కార్యక్రమం జీ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కథలను మరింత సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా మొదలైంది. సరికొత్త దృక్పథాల కోసం పెరిగిన డిమాండ్ నేపథ్యంలో, సృజనాత్మకత కలిగిన రచయితలను గుర్తించడంతోపాటు సృజనా సామర్థ్యం, రచయితల వృత్తిగత ప్రపంచం మధ్య అంతరాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఎంపికైన రచయితలకు విస్తృతమైన ‘Z’ సంస్థలోని టీవీ, డిజిటల్, సినిమా ప్లాట్‌ఫామ్‌ల కోసం సమర్థవంతమైన, ఆకర్షణీయమైన కథలను రూపొందించే అవకాశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న జీ రైటర్స్ రూమ్ కార్యక్రమంలో భాగంగా జీ తెలుగు ఆగస్టు 30న హైదరాబాద్ వేదికగా రచయితలను ఎంపిక చేయనుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు రచయితలను ప్రోత్సహించడమే లక్ష్యంగా జీ తెలుగు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జీ తెలుగులో రాబోయే సీరియల్స్‌కు కథలను రాసే రచయితలతోపాటు సినిమా కథకులను సైతం ఎంపిక చేయనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు రాత పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు రైటర్స్ రూమ్ లో చేరే అవకాశం లభిస్తుంది. ఈ జాబితాలో ఎంపికైన రచయితలకు పరిశ్రమ నిపుణులు రచనాశైలిలో మెలకువలు నేర్పిస్తారు. జీ నుంచి రాబోయే ప్రాజెక్టులలో ఈ రచయితలు భాగమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జీ రైటర్స్ రూమ్ ఆధ్వర్యంలో నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగిన సెలక్షన్స్లో వందలాదిమంది ఔత్సాహిక రచయితలు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రాంతం నలుమూలల నుండి ఆకాంక్షిత స్క్రీన్ రైటర్ల అసాధారణ ప్రతిభను మరియు సృజనాత్మకతను ప్రదర్శించాయి. రచనపై ఇష్టం ఉన్న చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంతో పాటు పరిశ్రమ నిపుణులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఔత్సాహికులను ప్రోత్సహించి భారతదేశానికి తర్వాతి తరం రచయితలను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

ఈ కార్యక్రమం గురించి జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌, జీ తెలుగు, తమిళం, కేరళం & ZEE5 చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడురు మాట్లాడుతూ.. ‘జీ రైటర్స్ రూమ్ ఔత్సాహిక రచయితలు వారిలోని సృజనాత్మకతను వెలికితీసే ఒక అద్భుతమైన అవకాశం. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన రచయితలు మా సంస్థలోని విభిన్న వేదికలపై రూపొందే సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ లకు కథలను అందిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న రచయితలు తమలోని ప్రతిభకు సానపెట్టి సరికొత్త కథలతో భవిష్యత్తుకు బాటలు వేసుకునే చక్కని అవకాశం. హైదరాబాద్లో ఈ శనివారం జరగనున్న సెలక్షన్స్ను తెలుగు రచయితలు సద్వినియోగపరుచుకోవాలి’ అన్నారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్లో జరగనున్న జీ రైటర్స్ రూమ్ ఆడిషన్స్ వివరాలు:

  • వేదిక:
  • శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, సారథి స్టూడియోస్ ఎదురుగా,
  • మెట్రో స్టేషన్ దగ్గర, అమీర్పేట్,
  • హైదరాబాద్ – 500016
  • ఫోన్ నెం: 9397397771
  • తేదీ: ఆగస్టు 30, 2025
  • సమయం: ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు

తెలుగు కథల్లోని సాంస్కృతిక వైవిధ్యాన్ని, భావోద్వేగాలను ప్రతిబింబించే కథకులను ప్రోత్సహించి వారిని శక్తివంతమైన రచయితలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జీ తెలుగు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సినిమా రచయితగా మారాలని కలలు కనే ఉత్సాహవంతులకు జీ తెలుగు అందిస్తున్న అద్భుత అవకాశం.. మీ కథలతో సిద్ధంగా ఉండండి, సినీ రచయితగా మారే అవకాశం అందుకోండి! మీరు zeewritersroom.com వెబ్ సైట్ లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..