AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanmukh Jaswanth: సూసైడ్ చేసుకోవాలనుకున్నాను.. చనిపోతే ఎవరు పట్టించుకోరు.. షణ్ముఖ్ జశ్వంత్ పోస్ట్..

కొన్నిరోజుల క్రితం అనుకోకుండా డ్రగ్స్ కేసులో ఇరుకున్న షణ్ముఖ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాకాలం పాటు సైలెంట్ అయిపోయాడు షణ్ముఖ్. తాజాగా ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన షణ్ముఖ్.. తన ఇన్ స్టాలో షాకింగ్ స్టోరీ పెట్టాడు. ఎన్నోసార్లు తాను సూసైడ్ చేసుకోవాలనుకున్నానని.. కానీ చనిపోతే ఎవరు పట్టించుకోరంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

Shanmukh Jaswanth: సూసైడ్ చేసుకోవాలనుకున్నాను.. చనిపోతే ఎవరు పట్టించుకోరు.. షణ్ముఖ్ జశ్వంత్ పోస్ట్..
Shanmukh Jaswanth
Rajitha Chanti
|

Updated on: Jul 13, 2024 | 4:41 PM

Share

సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న యూట్యూబ్ స్టార్స్‏లో షణ్ముఖ్ జశ్వంత్ ఒకరు. సాఫ్ట్ వేర్ డెవలపర్ షార్ట్ ఫిల్మ్ ద్వారా టాలీవుడ్ హీరోలను మించి అభిమానులను సంపాదించుకున్నాడు. నెట్టింట షణ్ముఖ్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్ వచ్చిందంటే సూపర్ హిట్ కావాల్సిందే అన్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్.. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా షణ్ముఖ్ క్రేజ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. బిగ్‏బాస్ టైటిల్ విజేత అనుకున్న షణ్ముఖ్ రన్నరప్ అయ్యాడు. ఆ తర్వాత దీప్తితో బ్రేకప్.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, డ్రగ్స్ కేసు ఇలా ఒకదాని తర్వాత మరొక ఇబ్బందులో పడిపోయాడు. కొన్నిరోజుల క్రితం అనుకోకుండా డ్రగ్స్ కేసులో ఇరుకున్న షణ్ముఖ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలాకాలం పాటు సైలెంట్ అయిపోయాడు షణ్ముఖ్. తాజాగా ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన షణ్ముఖ్.. తన ఇన్ స్టాలో షాకింగ్ స్టోరీ పెట్టాడు. ఎన్నోసార్లు తాను సూసైడ్ చేసుకోవాలనుకున్నానని.. కానీ చనిపోతే ఎవరు పట్టించుకోరంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

“నాకు ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి. మానసిక ఒత్తిడి అనే సమస్య గంటలు, రోజులలో తీరిపోయే సమస్య కాదు.. చాలా కాలం సమయం తీసుకుంటుంది. అందుకు మనం కచ్చితంగా వెయిట్ చేయాలి. ఎన్ని సమస్యలు వచ్చినా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా కానీ.. ఒక్కసారి మనం సూసైడ్ చేసుకుంటే ప్రపంచంలో ఎవరూ పట్టించుకోరు. కేవలం ఫ్యామిలీ మాత్రమే బాధపడుతుంది. ప్లీజ్.. ఏదైనా సమస్యను ఎదుర్కొండి. దేవుడు కష్టాలను పెడుతూనే మనల్ని పరీక్షిస్తుంటాడు. ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొవాలి. అప్పుడు మనకు కావాల్సింది దొరుకుతుంది. నాకు ఉన్న అనుభవాలలో నేను అన్నింటిని అర్థం చేసుకున్నాను. అందుకే చెబుతున్నాను.. మీరు చాలా స్ట్రాంగ్.. మీరేదైనా చేయగలరు” అంటూ పోస్ట్ చేశాడు.

Shanmukh Jaswanth Post

Shanmukh Jaswanth Post

చాలాకాలం సైలంట్ అయిన షణ్ముఖ్.. ఇటీవలే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ ద్వారా యూట్యూబ్ సంచలనంగా మారిన షణ్ముఖ్.. ఇప్పుడు లీలా అనే వెబ్ సిరీస్ ద్వారా అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.