Raj Tarun: TV9తో మాట్లాడుతూ అసలు విషయాలు బయటపెట్టిన లావణ్య.. అతనెవరో తెలియదంటూ..
రాజ్ తరుణ్ తనను గుడిలో పెళ్లి చేసుకున్నాడని.. అబార్షన్ కూడా చేయించాడని.. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించింది లావణ్య. ఇక శుక్రవారం అర్దరాత్రి ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందని.. సూసైడ్ చేసుకుంటున్నంట్లు తనకు మెసేజ్ పెట్టిందని లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నారు.
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రేమించి తనను పెళ్లి చేసుకుని ఇప్పుడు తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. హీరోయిన్ మాల్వీ మల్హోత్ర కోసం తనను దూరం పెడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు హీరోయిన్ మాల్వీ సైతం లావణ్య పై కేసు పెట్టింది. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్న తరుణంలో రాజ్ తరుణ్ తనను గుడిలో పెళ్లి చేసుకున్నాడని.. అబార్షన్ కూడా చేయించాడని.. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు అందించింది లావణ్య. ఇక శుక్రవారం అర్దరాత్రి ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందని.. సూసైడ్ చేసుకుంటున్నంట్లు తనకు మెసేజ్ పెట్టిందని లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నారు. రాజేష్ అనే మరో లాయర్ మెసేజ్ చేయడం కారణంగానే లావణ్య ఆత్మహత్య చేసుకోవాలనుకుందని అన్నారు.
తాజాగా టీవీ9తో మాట్లాడిన లావణ్య.. తాను ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నదో వివరించింది. తనకు రాజ్ తరుణ్ కావాలని.. తనపై ఎప్పుడూ ఫిర్యాదు లేదని తెలిపిందే. రాజ్ తరుణ్ కోసమే ఈ ఫైట్ చేస్తున్నాను.. తనపై పోలీసులు పెట్టిన డ్రగ్స్ కూడా తప్పుడు కేసు అంటూ అసలు విషయాలు బయటపెట్టింది.
టీవీ9తో లావణ్య మాట్లాడుతూ.. “రాజ్ తరుణ్‌తో గొడవపడే ఉద్దేశ్యం నాకు లేదు. అతడు తప్పు చేశాడని ఎక్కడా చెప్పలేదు. నాకు రాజ్ తరుణ్ కావాలి. ఇదంతా అతని కోసమే చేస్తున్నాను. రాజ్, నేను 11 ఏళ్లు కలిసి ఉన్నాం. వేరే వాళ్లతో ఉండి నన్ను వద్దు అంటున్నాడు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. రాజ్ తరుణ్ కోసం నేను నిరాహార దీక్ష చేస్తాను. సినిమా పెద్దలను కలుస్తాను. డ్రగ్స్ కేస్ సాకుగా చూపి నన్ను దూరం పెట్టాడు. పోలీసులు పెట్టిన డ్రగ్స్ కేస్ పూర్తిగా ఫాల్స్ కేస్. నేను రైల్వే స్టేషన్ లో ఉంటే నన్ను అక్రమంగా తీసుకెళ్లారు. రాజ్ తరుణ్ కోసం ఎంత వరకైనా వెళ్తాను. రాజేష్ అనే అడ్వకెట్ నిన్న రాత్రి కేస్ నిలబడదు అని మెసేజ్ పెట్టాడు. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. ఆ బాధలోనే నేను ఆత్మ హత్య చేసుకోవాలనుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.