AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR : జోరు పెంచిన తారక్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీ.. సినిమాలతోపాటు టీవీ షో కూడా ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తారక్ నటిస్తున్న విషయం తెలిసిందే

Jr NTR : జోరు పెంచిన తారక్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీ.. సినిమాలతోపాటు టీవీ షో కూడా ..
Jr.ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 27, 2021 | 7:22 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తారక్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొమురం భీమ్ గా కనిపించనున్నాడు యంగ్ టైగర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కరోనా అవాంతరాల కారణంగా షూటింగు విషయంలో మరింత జాప్యం జరుగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ త్వరలోనే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి అభిమానులు కూడా ఈ పాపులర్ షోలోకి ఎన్టీఆర్  ఎంటర్ అవ్వడంతో తెగ ఖుషీ అవుతున్నారు. కానీ కరోనా కారణంగా ఇటు సినిమా షూటింగు .. అటు టీవీ కార్యక్రమం ఆడిషన్స్ ఆలస్యమయ్యాయి. అయితే షో నిర్వాహకులు ఇప్పుడు చకచకా సన్నాహాలు చేసేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు.

మొదటగా హిందీలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’గా ప్రారంభమైంది. ఆ తర్వాత తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే పేరుతో నాలుగు సీజన్లు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఇప్పుడు ఐదవ సీజన్ హోస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో పలు రకాల కాస్ట్యూమ్స్ వేయిస్తూ ఫోటో సెషన్స్ జరుపుతున్నారని సమాచారం. ‘ఆర్ ఆర్ ఆర్’లో తన పోర్షన్ ను త్వరగా ముగించాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నాడట. వచ్చేనెలలో ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేస్తే, ఆ వెంటనే టీవీ షోకి వెళ్లిపోవచ్చని భావిస్తున్నాడట. ఇక కొరటాల సినిమా కూడా ఆగస్టు నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anasuya Bharadwaj: అనసూయ దిమ్మతిరిగే కౌంటర్‌..? “మా” ఎన్నికల్లో మాటల వేడి షురూ… ( వీడియో )

Avantika Vandanapu: హాలీవుడ్​ మూవీలో తెలుగమ్మాయి అవంతిక వందనపు ..

Akhil Akkineni : నో చేంజ్.. అనుకున్న డేట్ నే ప్రేక్షకుల ముందుకు రానున్న అఖిల్ సినిమా..