AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhil Akkineni : నో చేంజ్.. అనుకున్న డేట్ నే ప్రేక్షకుల ముందుకు రానున్న అఖిల్ సినిమా..

అక్కినేని అఖిల్ సాలిడ్ హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ మూడు సినిమాలు నిరాశనే మిగిల్చాయి.

Akhil Akkineni : నో చేంజ్.. అనుకున్న డేట్ నే ప్రేక్షకుల ముందుకు రానున్న అఖిల్ సినిమా..
Akhil
Rajeev Rayala
|

Updated on: Jun 27, 2021 | 7:32 AM

Share

Akhil Akkineni :

అక్కినేని అఖిల్ సాలిడ్ హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ మూడు సినిమాలు నిరాశనే మిగిల్చాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఒకటి. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతుంది. ఈ సినిమా పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అఖిల్. ఈ సినిమా ఈ పాటికే రిలీజ్ కావాల్సుంది కాని.. కరోనా కారణంగా వాయిదా పడింది.

కరోనా కూల్ అయిపోవడం.. థియేటర్లు ఓపెన్ అవుతుండడంతో ఈ సినిమాను రిలీజ్‌ చేసే పనిలో పడ్డారు అఖిల్. ఆలస్యం చేయకుండా ఆగస్టు ఫస్ట్ వీక్‌లో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇక ఇప్పటికే గోపీసుందర్‌ స్వరపరిచిన ఈ సినిమాలోని సాంగ్స్‌ అందర్నీ ఆకట్టుకుంటూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.ఈ సినిమాతో పాటు అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “ఏజెంట్” సినిమాను చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ ను సురేందర్ రెడ్డి కొత్తగా చూపించనున్నాడు. ఈ సినిమా ఫస్టులుక్ బయటికి వచ్చిన దగ్గర నుంచి అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నామని ముందుగానే చెప్పారు. ఇదిలా ఉంటే చాలా సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి.  ఈక్రమంలో డిసెంబర్ 24వ తేదీని ఖరారు చేసుకున్న అఖిల్ సినిమా, వాయిదా పడొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమాను అదే రోజున విడుదల చేయాలనే గట్టిపట్టుదలతోనే మేకర్స్ ఉన్నారట. చూడాలి మరి ఎం జరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి :

Hero Nitin: వెండి తెరపై హీరోగా అడుగు పెట్టి 19 ఏళ్ళు పూర్తి చేసుకున్న నితిన్.. ఎన్ని సినిమాలను వదులుకున్నాడో తెలుసా

Grahan Web Series: రిలీజ్‌కు ముందు బోలెడంత‌ నెగిటివిటీ.. ఇప్పుడు మేకర్స్‌ను ప్రైజ్‌ చేస్తున్న ఆడియన్స్‌

Jersy Movie: ఆస్ట్రేలియ‌న్ జర్న‌లిస్ట్‌ను క‌దిలించిన నాని జెర్సీ సినిమా.. ఎమోష‌న‌ల్ మూవీపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ..

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!