Grahan Web Series: రిలీజ్‌కు ముందు బోలెడంత నెగిటివిటీ.. ఇప్పుడు మేకర్స్‌ను ప్రైజ్ చేస్తున్న ఆడియన్స్
ఈ మధ్య కాలంలో వివాదాస్పదమైన మరో వెబ్ సిరీస్ గ్రహన్. ఇందిరా గాంధీ హత్య.. ఆ తరువాత సిక్కుల మీద జరిగిన దాడుల నేపథ్యంలో ఈ సిరీస్‌ను రూపొందించారు మేకర్స్.
ఈ మధ్య కాలంలో వివాదాస్పదమైన మరో వెబ్ సిరీస్ గ్రహన్. ఇందిరా గాంధీ హత్య.. ఆ తరువాత సిక్కుల మీద జరిగిన దాడుల నేపథ్యంలో ఈ సిరీస్‌ను రూపొందించారు మేకర్స్. అయితే ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచే ఈ షో మీద వివాదం మొదలైంది. సిక్కుల మీద జరిగిన దాడులకు ఓ సిక్కు వ్యక్తే కారణం అన్నట్టుగా ట్రైలర్‌లో చూపించటంతో సిక్కు సంఘాలు ఫైర్ అయ్యాయి. షో బ్యాన్ చేయాలంటూ ఆందోళన చేయటమే కాదు… బ్రాడ్‌కాస్ట్ మినిస్ట్రీకి కంప్లయింట్స్ కూడా ఇచ్చాయి. అయితే వివాదాల మధ్యే గురువారం నుంచి స్ట్రీమ్ అవుతోంది గ్రహన్. రిలీజ్‌కు ముందు షోలో నెగిటివిటీ గురించే ఎక్కువగా చర్చ జరిగినా… రిలీజ్ తరువాత మాత్రం సీన్ మారిపోయింది. సెన్సిటివ్ ఇష్యూను కూడా హ్యూమన్ యాంగిల్‌లో చూపించారంటూ మేకర్స్‌ను ప్రైజ్ చేస్తున్నారు ఆడియన్స్.
రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తయారు చేసిన ఫిక్షనల్ స్టోరి అని ముందే చెప్పిన మేకర్స్… అల్లర్ల విషయంలో ఎవరినీ కార్నర్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం ఆ టైమ్ పీరియడ్‌లో ఓ ఫిక్షన్ల్ క్యారెక్టర్ చుట్టూ కథను నడిపించి సక్సెస్ అయ్యారు. టెక్నికల్‌గానూ గ్రహన్‌కు మంచి అప్లాజ్ వస్తోంది. మరి ఈ సక్సెస్ టాక్‌తో వివాదం ముగిసినట్టేనా.. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏది ఏమైనా వివాదాలతో వెబ్ సిరీస్‌కు రూపాయి ఖర్చు చేయకుండానే బోలెడంత పబ్లిసిటీ వచ్చింది.
Also Read: వీడిన చిక్కుముడి.. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పీఠాధపతి ఆయనే