Nithiin’s Maestro : నితిన్ బాలీవుడ్ రీమేక్ “మాస్ట్రో” కూడా ఓటీటీ బాట పట్టనుందా..?
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చెక్, రంగ్ దే సినిమాలతో పేక్షకుల ముందుకు వచ్చిన నితిన్..
Nithiin’s Maestro : యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చెక్, రంగ్ దే సినిమాలతో పేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఇప్పుడు ఓ బాలీవుడ్ రీమేక్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ పలు భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. చాలా వరకు ఈ సినిమా షూటింగ్ కూడా జరుపుకుంది. మిగిలి ఉన్న కొద్ది భాగం చిత్రీకరణను ఇటీవలే ముగించారు టీమ్. గత కొన్నిరోజుల నుండి సినిమాను ఓటీటీలోకి విడుదలచేస్తారనే వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.తాజా సమచారం మేరకు ఈ సినిమాను సుమారు రూ. 32 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇవి కేవలం స్ట్రీమింగ్ హక్కులు మాత్రమే. ఇంకా ఇతర హక్కులు మిగిలే ఉన్నాయి. ఇవన్నీ కలిపితే నిర్మాతకు మంచి లాభాలే. ప్రస్తుతం సినిమాకు సంబంధించి చివరి దశ పనులు పూర్తి అవుతున్నాయి. జులైలో ఫస్ట్ కాపీ సిద్ధం చేసి ఆగష్టు 2వ వారంలో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.
హాట్ స్టార్ డీల్ ద్వారానే నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్స్ మిగిలాయట. ఆగష్టు నెలలో చిత్రాన్ని విడుదలచేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పించనున్నారు. నితిన్ కెరీర్లో ఇదే పూర్తిస్థాయి ప్రయోగాత్మక చిత్రం. ఇందులో కథానాయకిగా నభా నటేష్ నటిస్తుండగా ప్రధానమైన నెగెటివ్ పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా పోషిస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :