Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jersy Movie: ఆస్ట్రేలియ‌న్ జర్న‌లిస్ట్‌ను క‌దిలించిన నాని జెర్సీ సినిమా.. ఎమోష‌న‌ల్ మూవీపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ..

Jersy Movie: తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో జెర్సీ సినిమాకు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ సినిమా న‌చ్చ‌ని స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుడు ఉండ‌డ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. సినిమా చూసే ప్ర‌తీ వ్య‌క్తి అర్జున్ పాత్ర‌లో త‌న‌ను తాను...

Jersy Movie: ఆస్ట్రేలియ‌న్ జర్న‌లిస్ట్‌ను క‌దిలించిన నాని జెర్సీ సినిమా.. ఎమోష‌న‌ల్ మూవీపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ..
Jersy Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 26, 2021 | 9:09 PM

Jersy Movie: తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో జెర్సీ సినిమాకు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ సినిమా న‌చ్చ‌ని స‌గ‌టు సినీ ప్రేక్ష‌కుడు ఉండ‌డ‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. సినిమా చూసే ప్ర‌తీ వ్య‌క్తి అర్జున్ పాత్ర‌లో త‌న‌ను తాను చూసుకుంటాడు. ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా సాగిన ఈ సినిమా తెలుగు తెర‌పై ఓ అద్భుతాన్ని సృష్టించింది. తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న ఈ సినిమాను ఇప్పుడు హిందీలోనూ రీమేక్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. అంత‌లా ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే జెర్సీ స్టామీనా కేవ‌లం భార‌త దేశానికే పరిమితం కాలేదు. అంత‌ర్జాతీయ ఖ్యాతిని గ‌డించింది. ఎమోష‌న్‌కు భాష‌తో, ప్రాంతంతో సంబంధం లేద‌ని నిరూపించిందీ సినిమా. ఆస్ట్రేలియాకు చెందిన ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ అమండా బైలీ ఇటీవ‌ల జెర్సీ సినిమాను చూశారు. త‌న‌కు తెలియ‌ని భాష‌కు సంబంధించిన జెర్సీ చిత్రం.. అమండా హృద‌యానికి ఎంతగానో హ‌త్తుకుంది. ఈ విష‌యాన్ని వెంట‌నే ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు అమండా. జెర్సీ సినిమాపై ప్ర‌శంసల వ‌ర్షం కురిపిస్తూ.. `నేను జెర్సీ సినిమాను చూశాను. ఈ సినిమా ఒక అద్భుతమైన ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. అర్జున్ త‌న క‌ల‌ను సాకారం చేసుకునే విధానాన్ని మేక‌ర్స్ బ్రిలియంట్‌గా చూపించారు. హీరో నాని అద్భుతంగా న‌టించారు. మీరు అత‌నితో న‌వ్వుతారు, అత‌నితో ఏడుస్తారు. ఈ సినిమాలో నా ఫేవ‌రేట్ సీన్‌.. ట్రైన్ స‌న్నివేశం` అంటూ జెర్సీ సినిమాపై త‌న అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు అమండా.

Also Read: Dhanush New House: కొత్త ఇళ్లు నిర్మించుకుంటున్న ధ‌నుష్‌.. ఎంత ఖ‌ర్చు పెట్ట‌నున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

North Indian actresses: ఉత్త‌రాధి భామ‌లు టాలీవుడ్‌పై దండెత్తారు.. ఎంత‌మంది క్యూ క‌ట్టారో మీరే చూడండి

Monal Gajjar: ఓ ఇంటిది అయిన బిగ్‌బాస్ బ్యూటీ.. తాను ఇప్పుడు అధికారికంగా హైద‌రాబాదీ అంటూ ఆస‌క్తిక‌ర పోస్ట్.