AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

North Indian actresses: ఉత్త‌రాధి భామ‌లు టాలీవుడ్‌పై దండెత్తారు.. ఎంత‌మంది క్యూ క‌ట్టారో మీరే చూడండి

తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్లెక్కడ అని భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి మళ్లీ మొదలైంది. టాలీవుడ్ నిండా ఇప్పుడు హిందీ హీరోయిన్లే కనిపిస్తున్నారు.

North Indian actresses: ఉత్త‌రాధి భామ‌లు టాలీవుడ్‌పై దండెత్తారు.. ఎంత‌మంది క్యూ క‌ట్టారో మీరే చూడండి
North Heroins
Ram Naramaneni
|

Updated on: Jun 26, 2021 | 7:55 PM

Share

తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్లెక్కడ అని భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి మళ్లీ మొదలైంది. టాలీవుడ్ నిండా ఇప్పుడు హిందీ హీరోయిన్లే కనిపిస్తున్నారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే.. నియర్ ఫ్యూచర్‌లో తెలుగు సినిమా తెలుగు సినిమాలా వుండబోదేమో అనే డౌట్స్ పుట్టేస్తున్నాయి.. ..!తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమాగా ఎలివేట్ అయ్యాక.. ఇక్కడ గ్లామర్ ఎలిమెంట్‌ కూడా స్పాన్‌ పెంచుకుంటూ వెళుతోంది. అందుకే.. ఆలిండియా క్రేజ్ వున్న హీరోయిన్లంతా తమ కేరాఫ్‌ని తెలుగులోకి మార్చేసుకున్నారు ట్రిపులార్‌లో సీత క్యారెక్టర్ చేస్తున్న ఆలియా భ‌ట్… కమింగ్ సూన్‌ టు హైదరాబాద్ అంటున్నారు. ఆమె కోసం షెడ్యూల్‌ని స్పెషల్‌గా డిజైన్ చేసి పెట్టారు జక్కన్న.

సాహోతో బీటౌన్ గ్లామర్‌కి అలవాటుపడ్డ డార్లింగ్‌ అక్కడినుంచి వెనక్కుతిరిగి చూసే ఆలోచనలో లేరు. ప్రభాస్‌ని రాముడిగా పోట్రెయిట్ చేస్తూ ఓం రౌత్ చేస్తున్న ఆదిపురుష్‌లో జానకీదేవిగా కనిపించబోతున్నారు క్రితి సనన్. ప్రభాస్‌ నాగీతో చేస్తున్న  మూవీలో దీపికా పదుకొన్‌ ఫిమేల్ లీడ్ చేస్తున్నారు. మరో నార్త్ బ్యూటీ జాక్వెలిన్‌.. పవన్‌ కల్యాణ్‌తో షూట్స్‌లో జాయిన్ కావడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రౌడీ హీరో విజయ్‌దేవరకొండ చేస్తున్న లైగర్ మూవీ కూడా ముంబై అమ్మాయి అనన్య పాండేతో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నారు. మేజర్‌ ఉన్నిక్రిష్ణన్ బయోపిక్‌లో అడివి శేష్‌కి జతగా సాయీ మంజ్రేకర్ నటిస్తున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. బిగ్‌బాస్ ఆఫ్‌ టాలీవుడ్‌ మెగాస్టార్ కూడా… హీరోయిన్ కోసం ఉత్తరం దిక్కుకే చూస్తున్నారట. బాబీతో తీస్తున్న మూవీలో చిరూకు జోడీగా సోనాక్షి సిన్హా ఫిక్సయ్యారు. సో… ప్రస్తుతం తెలుగు బిగ్ మూవీస్‌లో చేస్తున్న హీరోయిన్లలో ముప్పాతిక భాగం హిందీవాళ్ళే వున్నారు. చూస్తుండగానే… తెలుగు సినిమా గ్లామర్ కలర్ మొత్తం బాలీవుడ్‌ కలర్‌లోకి మారిపోయింది.

Also Read:  అజిత్‌తో స‌మానంగా మాస్ పోస్ట‌ర్..కార్తికేయను రా.. ర‌మ్మంటున్న అరవ ఆడియన్స్

 ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్‌కు 100 కోట్ల రెమ్యూన‌రేష‌న్..! ఈ లిస్ట్‌లో ఉన్న నెక్ట్స్ టాలీవుడ్ హీరో ఎవ‌రంటే..?

Follow Us
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలా అంటే
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..