టాలీవుడ్ పైన దృష్టి పెడుతున్న కోలీవుడ్ స్టార్లు… తెలుగు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న తమిళ్ హీరోలు

ఇప్పుడు యావత్ దేశం మొత్తం ఫోకస్.. టాలీవుడ్ పైనే పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీస్ ఎక్కువగా నిర్మిస్తున్న ఏకైక ఇండస్ట్రీ ఏదైనా  ఉంది అంటే అది టాలీవుడ్ మాత్రమే.

టాలీవుడ్ పైన దృష్టి పెడుతున్న కోలీవుడ్ స్టార్లు... తెలుగు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న తమిళ్ హీరోలు
Dhanush
Follow us

|

Updated on: Jun 26, 2021 | 9:49 PM

ఇప్పుడు యావత్ దేశం మొత్తం ఫోకస్.. టాలీవుడ్ పైనే పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీస్ ఎక్కువగా నిర్మిస్తున్న ఏకైక ఇండస్ట్రీ ఏదైనా  ఉంది అంటే అది టాలీవుడ్ మాత్రమే. ఇప్పుడిప్పుడే పరభాషా నటులు.. మనవైపే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ధనుష్, విజయ్ వంటి స్టార్లు తెలుగులో మూవీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఆ లిస్టులోకి మరో స్టార్ హీరో చేరాడు. తెలుగు చిత్ర పరిశ్రమ వెలిగిపోతుంది. దేశవ్యాప్తంగా అన్ని బాలీవుడ్ తో సహా.. మిగతా ఇండస్ట్రీలను చూస్తే.. తెలుగులోనే ఎక్కువ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. దీంతో ఆటోమేటిగ్గా ఇతర పరిశ్రమకు చెందిన నటులు కూడా మనవైపు చూస్తున్నారు. ఇక్కడి మార్కెట్ ను అంచనా వేసుకుని.. సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా “జగమే తందిరం” మూవీతో ప్రపంచ స్థాయి నటుడిగా పేరుతెచ్చుకున్న ధనుష్.. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. హీరోయిన్ గా సాయిపల్లవి అని అనుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి.

ఇటు మాస్టర్ విజయ్ కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ మూవీని ఒప్పుకున్నాడు. వంశీ పైడిపల్లి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడీ లిస్టులోకి సెన్షేషన్ స్టార్.. సూర్య కూడా చేరిపోయాడు. సూర్య నటించిన సినిమాలన్నీ డబ్బింగ్ చేసి.. తెలుగులో విడుదల చేసేవారు. అయితే ఈ సారి స్ట్రేయిట్ తెలుగు మూవీ చేసేందుకు సూర్య.. తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. బోయపాటితో సూర్య ఓ సినిమా చేస్తున్నాడనే న్యూస్.. గతంలో వినిపించింది. అయితే రీసెంట్ గా.. సూర్య త్రివిక్రమ్ తో మూవీ చేయాలనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల మూవీతోనే ముగించాలని అనుకోవడం లేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మరో తెలుగు కథకు ధనుష్ ఓకే చేసినట్లు తెలుస్తుంది. కుర్ర దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఓకే అయితే.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఓ బడా ప్రొడక్షన్ సంస్థతో ధనుష్ ఓ ఒప్పందం కూడా కుదుర్చుకుంటాడనే రూమర్ వినిపిస్తుంది. దీంతో వరుసగా తెలుగుతెరపై ధనుష్ చిత్రాలు రానున్నాయని తెలుస్తుంది.  ధనుష్ నటించే సినిమా డబ్బింగ్ అయినా మినిమంగా పాతిక నుండి ముప్పై కోట్ల వరకు బిజినెస్ చేసేలా క్రేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఆ ప్రయత్నంలో ధనుష్ ఏమేరకు సఫలం అవుతాడో చూడాలి.