RGV Revanth: ‘ఇక‌పై రేవంత్ రెడ్డి అనే సింహానికి పులుల‌న్నీ భ‌య‌ప‌డాల్సిందే’.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ఆర్‌జీవీ..

RGV Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులైన విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా పీసీసీ ప‌గ్గాలు ఎవ‌రికి ద‌క్కుతాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతోన్న వేళ కాంగ్రెస్ అధిష్టానం...

RGV Revanth: 'ఇక‌పై రేవంత్ రెడ్డి అనే సింహానికి పులుల‌న్నీ భ‌య‌ప‌డాల్సిందే'.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ఆర్‌జీవీ..
Revanth Reddy Rgv
Follow us

|

Updated on: Jun 26, 2021 | 9:54 PM

RGV Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులైన విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా పీసీసీ ప‌గ్గాలు ఎవ‌రికి ద‌క్కుతాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతోన్న వేళ కాంగ్రెస్ అధిష్టానం ఎట్ట‌కేల‌కు నిర్ణ‌యం తీసుకుంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి గ‌ట్టి పోటీ ఎదురైనప్ప‌టికీ చివ‌రికి కాంగ్రెస్ పెద్ద‌లు రేవంత్ వైపే మొగ్గు చూపారు. తాజాగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మితులైన నేప‌థ్యంలో సంచ‌ల‌న‌ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ స్పందించారు. స‌మాజాంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల ప‌ట్ల త‌నదైన శైలిలో స్పందించే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ రేవంత్ రెడ్డిపై కూడా ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌జీవీ ట్వీట్ చేస్తూ.. `ల‌య‌న్‌.. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మించి.. కాంగ్రెస్ పార్టీ ఎట్ట‌కేల‌కు ఒక సూప‌ర్, ఫెంటాస్టిక్ నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఇక ఇప్పుడు పులుల‌న్నీ… రేవంత్ రెడ్డి అనే సింహానికి భ‌య‌ప‌డ‌తాయి` అంటూ ట్వీట్ చేశారు. ఇక మ‌రో ట్వీట్‌లో.. `రేవంత్‌రెడ్డిని అధ్య‌క్షుడిగా ఎన్నుకున్న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీపై మ‌రోసారి ఆస‌క్తి క‌లిగింది. రాహుల్ గాంధీ నువ్వు, మీ అమ్మ ఒక గొప్ప ప‌ని చేశారు` అంటూ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఆర్‌జీవీ చేసిన ట్వీట్‌లు..

Also Read: Cops Apologise: రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్‌లో చిక్కుకుని మహిళ మృతి.. క్షమాపణలు చెప్పిన యూపీ పోలీసులు

Hero Nitin: వెండి తెరపై హీరోగా అడుగు పెట్టి 19 ఏళ్ళు పూర్తి చేసుకున్న నితిన్.. ఎన్ని సినిమాలను వదులుకున్నాడో తెలుసా

Prohibition of Fertilizers : కృష్ణా జిల్లాలో నిషేధిత ఎరువుల తయారీ..! తెలంగాణలో తయారీ అయినట్లుగా విక్రయాలు..