Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prohibition of Fertilizers : కృష్ణా జిల్లాలో నిషేధిత ఎరువుల తయారీ..! తెలంగాణలో తయారీ అయినట్లుగా విక్రయాలు..

Prohibition of Fertilizers : కొంతమంది అక్రమ వ్యాపారులు నిషేధించిన ఎరువులను సులువుగా తయారు చేసి వాటిని

Prohibition of Fertilizers : కృష్ణా జిల్లాలో నిషేధిత ఎరువుల తయారీ..! తెలంగాణలో తయారీ అయినట్లుగా విక్రయాలు..
Fertilizers
Follow us
uppula Raju

|

Updated on: Jun 26, 2021 | 9:34 PM

Prohibition of Fertilizers : కొంతమంది అక్రమ వ్యాపారులు నిషేధించిన ఎరువులను సులువుగా తయారు చేసి వాటిని రైతులకు విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇందుకోసం పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని యధేచ్చగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. తాజాగా ఖమం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో ఎరువుల మిక్సింగ్ యూనిట్ పేరుతో మాయాజాలం చేస్తున్న దశరధ్ ప్రసాద్ ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌పై వ్యవసాయ అధికారులు, పోలీసులు కలిసి తనిఖీలు నిర్వహించారు. దీంతో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిషేధించిన సుమారు 7 రకాల ఎరువులను కృష్ణా జిల్లా, బలుసుపాడు మండలం ,రేమల్లె గ్రామంలో అక్రమంగా తయారుచేస్తున్నారు. ఈ ఎరువులు తెలంగాణలో తయారీ అయినట్లు చెబుతూ పలు జిల్లాల్లో విక్రయాలు చేస్తున్నారు. దశరథ్ ప్రసాద్ ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై రైతులకు అంటగడుతున్నారు. తెలంగాణ లోని వ్యవసాయ శాఖ అధికారులను, డీలర్లను తప్పుదోవ పట్టిస్తూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు కంపెనీపై దాడులు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటికొచ్చింది.

సంబంధిత కంపెనీ పై వియం బంజర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు కంపెనీకి చెందిన డిప్యూటీ మేనేజర్ ఏపీకి చెందిన బాజీ నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రతి సంవత్సరం సుమారు పదికోట్ల రూపాయల ఎరువులను విక్రయిస్తారని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. పోలీసులు మరిన్ని వివరాల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంకా కంపెనీకి సంబంధించి పలు విషయాలు తెలియాల్సి ఉంది.

Inflation: పాకిస్తాన్ లో కిలో చక్కర 110 రూపాయలు..భారత్ నుంచి దిగుమతులు లేకనే..ఏం జరిగింది? ఏం జరగొచ్చు?

Medlar Fruit: ,ప్రపంచంలో ఈ పండుకు లేని ప్రత్యేకత దీని సొంతం.. కుళ్ళిన తర్వా త తినాలి.. లేదంటే అనారోగ్యమే

Adityanath Das: ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ పదవీకాలం పొడిగింపు.. ఎప్పటివరకంటే..?