Pawan Kalyan: ఆ సినిమా కథలో కీలక పాయింట్స్ ను పవన్ కళ్యాణ్ నే ఇస్తున్నారా.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సినిమాల్లో “గబ్బర్ సింగ్” చిత్రానికి ఎలాంటి ప్లేస్ ఉంటుందో తెలిసిందే.

pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సినిమాల్లో “గబ్బర్ సింగ్” చిత్రానికి ఎలాంటి ప్లేస్ ఉంటుందో తెలిసిందే. అవ్వడానికి రీమేక్ సినిమా అయినా కూడా దర్శకుడు హరీష్ శంకర్ తన టేకింగ్ తో మరో స్థాయిలో ఈ చిత్రాన్ని నిలిపాడు. దీనితో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్రేజీ కాంబోపై అంచనాలు పీక్స్ లో అలా స్టాండర్డ్ గా నిలిచిపోయాయి. అందుకే అదే బాటలో వీరి నుంచి మరో సినిమా అనౌన్స్ చెయ్యడంతో ఒక్కసారిగా భారీ హైప్ సెట్టయ్యింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారు.
మరి ఈ చిత్రంపైనే ఇంట్రెస్టింగ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. కొన్నాళ్ల కితమే పవన్ మేకోవర్ కోసం టాక్ రాగా ఇప్పుడు ఊహించని టాక్ వినిపిస్తుంది.ఈ చిత్రానికి గాను కథలో హరీష్ తో పాటు పవన్ కూడా పాలు పంచుకోనున్నారట. అంటే ఇద్దరి నుంచీ ఈ సినిమా కథ సిద్ధం అవుతుందని తెలుస్తుంది. కథలో కీలక పాయింట్స్ ను పవన్ కళ్యాణ్ ఇచ్చాడని.. పవన్ ఇచ్చిన ఇన్ పుట్స్ మరియు సలహాలు సూచనల మేరకు దర్శకుడు మరియు ఇతర రచయితలు కథను సిద్దం చేశారంటూ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :