Megastar Chiranjeevi: చిరంజీవి సినిమాలో డిజే టిల్లు ? .. ఆ స్టార్ డైరెక్టర్ మూవీలో యంగ్ హీరో.

ఇక ఇటీవలే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా కాకుండే.. తన తదుపరి చిత్రాలను ఇప్పుడే లైన్ లో పెడుతున్నారు చిరు. భోళా శంకర్ తర్వాత డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో ఓ మూవీ చేయనున్నారు. సోగ్గాడే చిన్నినాయన తర్వాత సైలెంట్ అయిన కళ్యాణ్ కృష్ణకు చిరు ఓకే చేశాడని తెలుస్తోంది.

Megastar Chiranjeevi: చిరంజీవి సినిమాలో డిజే టిల్లు ? .. ఆ స్టార్ డైరెక్టర్ మూవీలో యంగ్ హీరో.
Megastar Chiranjeevi, Siddu
Follow us
Rajitha Chanti

|

Updated on: May 06, 2023 | 10:06 AM

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మంచి ఫామ్ లో ఉన్నారు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భోళా శంకర్. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుండగా.. చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ కోల్ కత్తాలో జరుగుతుంది. ఇక ఇటీవలే ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా కాకుండే.. తన తదుపరి చిత్రాలను ఇప్పుడే లైన్ లో పెడుతున్నారు చిరు. భోళా శంకర్ తర్వాత డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో ఓ మూవీ చేయనున్నారు. సోగ్గాడే చిన్నినాయన తర్వాత సైలెంట్ అయిన కళ్యాణ్ కృష్ణకు చిరు ఓకే చేశాడని తెలుస్తోంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా.. మరోవైపు ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతుంది. అయితే ఇందులో చిరుతోపాటు.. మరో యంగ్ హీరో సైతం కనిపించనున్నారట. ఈ పాత్ర కోసం పలువురు కుర్ర హీరోల పేర్లు పరిశీలించగా.. చివరకు డిజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డను ఫైనల్ చేసినట్లుగా సమాచారం. హీరోగా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సిద్దూ. కేవలం ఒక్క సినిమాతోనే ఈ హీరో క్రేజ్ మారిపోయింది. ప్రస్తుతం డిజే టిల్లు స్వేర్ చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు.. చిరు సినిమాలోనూ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

చిరు… డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబోలో రాబోయే ఈ సినిమాను మెగాస్టార్ పెద్ద కూతురు సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.