Vijay Antony: ‘బిచ్చగాడు 2’ వివాదంపై స్పందించిన విజయ్ ఆంటొని.. తప్పుగా అర్థం చేసుకున్నారంటూ..

ఈ నేపథ్యంలో సినిమా ప్రచారకార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో విజయ్ ఆంటొనితోపాటు చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే విజయ్ మాట్లాడుతూ.. బిచ్చగాడు 2 సినిమా కథ విషయంలో జరిగిన వివాదం కేసులపై స్పందించారు.

Vijay Antony: ‘బిచ్చగాడు 2’ వివాదంపై స్పందించిన విజయ్ ఆంటొని.. తప్పుగా అర్థం చేసుకున్నారంటూ..
Vijay Antony
Follow us
Rajitha Chanti

|

Updated on: May 06, 2023 | 9:54 AM

గతంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించిన తమిళ్ డబ్బింగ్ మూవీ బిచ్చగాడు. ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ తీసుకువస్తున్నారు మేకర్స్. ఇందులో విజయ్ ఆంటొని ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆయన సతీమణి ఫాతిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మే 19న తెలుగుతోపాటు.. తమిళంలోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారకార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో విజయ్ ఆంటొనితోపాటు చిత్రయూనిట్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే విజయ్ మాట్లాడుతూ.. బిచ్చగాడు 2 సినిమా కథ విషయంలో జరిగిన వివాదం కేసులపై స్పందించారు.

“సింగపూర్ కు చెందిన ఓ వ్యక్తి ఈ కథ నాది అన్నారు. చెన్నైకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు కథ మాదే అని కేసు పెట్టారు. వీళ్లు మాత్రమే కాదు.. చాలా మంది ఈ కథ మాదే అని వాదించారు. కానీ ఈ మూవీ కోసం బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. కథ దీనిపై ఉండదు. కథ, కథనం అన్నీ బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ మీద ఉండవు. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, సర్జరీపై 100కు పైగా కథలు ఉన్నాయి. నాది అలాంటి కథే అని వారంతా తప్పుగా అర్థం చేసుకున్నారు. తమిళ్ హైకోర్ట్ విచారించి ఈ సినిమా కథకు ఇతర ఏ కథలతోనూ సంబంధంలేదని ఇది పూర్తిగా భిన్నమని తీర్పు ఇచ్చింది” అంటూ చెప్పుకొచ్చారు విజయ్.

బిచ్చగాడు అమ్మ సెంటిమెంట్.. బిచ్చగాడు 2 చెల్లెలి సెంటిమెంట్ తో నడుస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే తనకు పెద్ద ప్రమాదం జరిగిందని.. నిజానికి ఆ ప్రమాదం తర్వాతే తాను మరింత శక్తిమంతమయ్యానని అన్నారు. ఈ సినిమా మే 19న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ మూవీపై క్యూరియాసిటిని పెంచేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!