Nikhil Siddhartha: ఆ సినిమాలో సాయి పల్లవి నటన చూసి ఏడ్చేశా.. నిఖిల్ ఆసక్తికర కామెంట్స్
హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ సోలో హీరోగా ప్రేక్షకులను మెప్పించాడు. స్వామి రారా.., కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా.., కార్తికేయ 2, 18 పేజెస్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆచితూచి సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు. హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. ఆతర్వాత సోలో హీరోగా ప్రేక్షకులను మెప్పించాడు. స్వామి రారా.., కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా.., కార్తికేయ 2, 18 పేజెస్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరిగా స్పై అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈయంగ్ హీరో. కానీ ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు హిస్టారికల్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. స్వయంభూ అనే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ గురించి నిఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఓ హీరోయిన్ నటన చూసి ఏడ్చేశా అని తెలిపాడు నిఖిల్. ఆ హీరోయిన్ మరెవరో కాదు సాయి పల్లవి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ను యాంకర్.. మీరు ఎవరి నటిననైన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నిఖిల్ మాట్లాడుతూ.. తనకు సాయి పల్లవి నటన అంటే తనకు ఇష్టమని తెలిపాడు.
విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి నటన తనకు బాగా నచ్చిందని.. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో సాయి పల్లవి చనిపోయే సీన్ లో తన నటన చూసి కన్నీళ్లు వచ్చాయి అని తెలిపాడు. ఇదే విషయాన్నీ సాయి పల్లవికి కూడా చెప్పాను అని అన్నాడు నిఖిల్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది సాయి పల్లవి. నాగచైతన్యతో కలిసి తండేల్ అనే సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
నిఖిల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




