Aishwarya Rai Bachchan: విడాకుల రూమర్స్ కు ఒకే ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య, అభిషేక్..
తాజాగా ఒకే ఒక్క ఫొటోతో విడాకుల రూమర్స్ కు చెక్ పెట్టారు ఐష్ అబిషేక్. అది ఎలా అంటే.. భారతదేశంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. రంగులతో సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కుటుంబంతో హోలీని జరుపుకుంది. ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇంట్లో హోలీ జరుపుకున్నారు.

అందాల తార ఐశ్వర్య రాయ్ భర్తతో విడిపోతుందని ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ విడాకుల వార్తల పై ఇప్పటివరకు ఎవ్వరు కూడా స్పందించలేదు. అయినా కూడా ఈ రూమర్స్ ఆగడం లేదు. తాజాగా ఒకే ఒక్క ఫొటోతో విడాకుల రూమర్స్ కు చెక్ పెట్టారు ఐష్ అబిషేక్. అది ఎలా అంటే.. భారతదేశంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పలువురు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. రంగులతో సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కుటుంబంతో హోలీని జరుపుకుంది. ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇంట్లో హోలీ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోలు, వీడియోలను పంచుకున్నారు. ఇది చూసిన చాలా మంది ‘అభిషేక్-ఐశ్వర్య ఇలాగే హ్యాపీగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడాకుల గురించి గత ఏడాదిగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఇంకా కొందరికి అనుమానాలు ఉన్నాయి. అలాంటి వారికి ఈ ఫోటోతో క్లారిటీ వచ్చింది. హోలీ సందర్భంగా మంటలు వెలిగిస్తారు.. దాన్ని హోలికా దహన్ అంటారు . చాలా చోట్ల ఈ ఆచారం ఉంది. ఉత్తర భారతీయులు దీనిని ‘హోలికా దహన్’ అని పిలుస్తారు. ఐశ్వర్యరాయ్ ఇంట్లో ఈ వేడుక జరిగింది. బచ్చన్ కుటుంబానికి చెందిన వారందరూ అక్కడ కనిపించారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు ‘మీ కుటుంబాన్ని కలిసి చూడటం ఆనందంగా ఉంది’ అని కొందరు. ‘చూడు ఐశ్వర్య-అభిషేక్ బాగానే ఉన్నారు. ఫేక్ న్యూస్ చెప్పిన వారి నోరు మూయించిందని కొందరు అంటున్నారు. ఈ ఫోటోలో ఐష్ కూతురు ఆరాధ్య కూడా కనిపించింది. ఇటీవల ఆరాధ్యలేటెస్ట్ ఫోటోలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలో ఆమె చాలా అందంగా కనిపించింది. ఇది చూసిన పలువురు ఆమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేశారని అంటున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




