Virata Parvam: వెన్నెల కథే విరాట పర్వం.. అందరికీ గుర్తుండిపోయే పాత్ర.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరో..
విరాటపర్వం సినిమా అంటే వెన్నెల కథే.. ప్రేక్షకుల మనసులో ఆమె పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. ఉద్యమమే కాకుండా.. అద్భుతమైన ప్రేమకావ్యమే విరాటపర్వం చిత్రమన్నారు
వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రానా దగ్గుబాటి. ప్రస్తుతం ఈ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం విరాట పర్వం (Virata Parvam). డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా..ప్రియమణి, హీరో నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటిస్తున్నారు. నక్సల్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. విరాటపర్వం సినిమా అంటే వెన్నెల కథే.. ప్రేక్షకుల మనసులో ఆమె పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. ఉద్యమమే కాకుండా.. అద్భుతమైన ప్రేమకావ్యమే విరాటపర్వం చిత్రమన్నారు హీరో నవీన్ చంద్ర. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న నవీన్.. విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
గతంలో ‘దళం’ అనే సినిమా నక్సల్ నేపధ్యంలో చేశాను. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు ఫిట్నెస్ ఎక్కువ కావాలి. యాక్షన్ సీన్స్ కి చాలా కష్టపడాలి. విరాటపర్వంలో నేను, సాయిపల్లవి, రానా, ప్రియమణి .. నలుగురం కలసి సింగిల్ షాట్లో గన్స్ పట్టుకొని అర కిలోమీటర్ పరిగెత్తాలి. ఎక్కడ కెమెరా మిస్ అయినా, టెక్నికల్ గా ఏదైనా సమస్య తలెత్తినా మళ్ళీ పరిగెత్తాలి. ఒక్క టేక్ లో ఓకే అవ్వద్దు. మళ్ళీ మళ్ళీ చేయడానికి చాలా ఫిట్నెస్ వుండాలి. అలాగే తెలంగాణ యాస నేర్చుకోవడం కూడా గొప్ప అనుభవం. దర్శకుడు వేణు గారు వారి టీం ఎంతో అద్భుతంగా తెలంగాణ యాసని నేర్పించారు. విరాటపర్వం చిత్రానికి దర్శకుడు వేణు గారు రాసిన ఒకొక్క లైను చాలా డెప్త్ వుంటాయి. ముఖ్యంగా వెన్నెల పాత్ర అందరికీ గుర్తిండిపోతుంది. ఇది వెన్నెల కథే. ఆ పాత్ర చుట్టే మిగతా పాత్రలన్నీ వుంటాయి. ఇందులో ప్రతి సంఘటన ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్నారు. సాయి పల్లవితో కలసి పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. వెన్నెల పాత్ర నుండి ఆమె బయటికి రాలేదు. చాలా హార్డ్ వర్క్ చేశారు. వెన్నెల పాత్ర చుట్టే విరాటపర్వం కథ తిరుగుతుంది. వెన్నెల పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు నవీన్ చంద్ర.