KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న వేట.. 50 రోజులలో కేజీఎఫ్ 2 మరో సెన్సెషన్..

అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న వేట.. 50 రోజులలో కేజీఎఫ్ 2 మరో సెన్సెషన్..
Kgf 2
Follow us

|

Updated on: Jun 03, 2022 | 10:35 AM

డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో విడుదలైన కేజీఎఫ్ 2 (KGF 2) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంచనాలను తలకిందులు చేస్తూ రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 50 రోజులను పూర్తిచేసుకుంది. దీంతో తమ సినిమాను ఇంతలా ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది చిత్రయూనిట్. ట్రేడ్ వర్గాల ప్రకారం కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1240 కోట్లు వసూలు చేసింది.. ఇక ఇప్పుడు రూ. 1250 కోట్లకు చేరువలో ఉంది ఈ సినిమా. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది.

ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయ్ బాలన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమా 50 రోజులలో ప్రపంచవ్యాప్తంగా రూ. 1240 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీస్ ట్రూ బ్లూ బ్లాక్ బస్టర్..

ఇవి కూడా చదవండి

మొదటి వారం నుంచి 5వ వారం వరకు రూ. 1210.53 కోట్లు.. 6 వారం.. రూ.19.84 కోట్లు. 7 వారం..రూ. 1.02 కోట్లు. 2వ రోజు..రూ. 1.34 కోట్లు. 3వ రోజు.. రూ. 2.41 కోట్లు. 4వ రోజు.. రూ. 3.06 కోట్లు. 5వ రోజు.. రూ. 0.92 కోట్లు. 6వ రోజు.. రూ. 0.85 కోట్లు. 7వ రోజు.. రూ. 0.98 కోట్లు. మొత్తం.. రూ. 1240.95 కోట్లు.

కేజీఎఫ్ 2 పూర్తిచేసుకున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. “ఈ మైలురాయిని దాటేలా చేసినందకు ధన్యవాదాలు.. గతంలో వాగ్దానం చేశాము.. ఇప్పుడు అది నిజమైంది. మీ ప్రేమ, తిరుగులేని మద్దతుతో ఇది సాధ్యమైంది.. మీకు ధన్యవాదాలు. ” అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమా యశ్ కాకుండా.. ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, కీలకపాత్రలలో నటించగా.. రవి బస్రూర్ సంగీతం అందించారు.