Kiran Abbavaram: జోరు పెంచిన కుర్ర హీరో.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీ

ఆ తర్వాత ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం సినిమాతో మంచి హిట్ తో పాటు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.  హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు  కిరణ్ అబ్బవరం.

Kiran Abbavaram: జోరు పెంచిన కుర్ర హీరో.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీ
Kiran Abbavaram
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 29, 2022 | 7:23 PM

టాలీవుడ్ లో టాలెంట్ నమ్ముకొని దూసుకుపోతోన్న హీరోల్లో కుర్ర హీరో కిరణ్ అబ్బవరం ఒకరు.రాజావారి రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత ఎస్ ఆర్ క‌ళ్యాణ‌ మండ‌పం సినిమాతో మంచి హిట్ తో పాటు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.  హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు  కిరణ్ అబ్బవరం. ఇటీవలే సమ్మేతమే, నేను మీకు బాగాకావాల్సిన వాడిని లాంటి సినిమాలతోప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వినరో భాగ్యము విష్ణుకథ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నాడు కిరణ్.

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న సినిమా  “వినరో భాగ్యము విష్ణుకథ”. వినరో భాగ్యము విష్ణుకథ సినిమాలో కిరణ్‌ అబ్బవరం సరసన  కశ్మీర పరదేశి నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ   షూటింగ్ దశలో ఉంది.

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తుండగా..మెగా నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. మురళీ కిషోర్‌ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి