Adipurush: ఆదిపురుష్ కథ చెప్పడానికి అంత సమయమా..? భారీగా ప్రభాస్ మూవీ రన్ టైమ్..
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అంత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు అదే..
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అంత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. అయితే సినిమా టీజర్ విడుదలైన నాటి నుంచి ఈ చిత్రం ఏదో ఒక అంశంతో నిత్యం వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. టీజర్ అస్సలు బాలేదంటూ కొందరు, కొందరి మనో భావాలు దెబ్బ తీసేలా సన్నివేశాలు ఉన్నాయంటూ మరికొందరు ఆరోపణలు చేస్తూ వచ్చారు.
అయితే అనంతరం చిత్ర యూనిట్ విడుదల చేసిన 3డీ వెర్షన్‌తో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ను సంపాదించుకుంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆదిపురుష్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే ఈ సినిమా రన్ టైమ్. నిజానికి రామాయణ ఇతిహాసం లాంటి కావ్యాన్ని సినిమా రూపంలో చూపించడం అంత సులభమైన విషయం కాదు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా రన్ టైమ్ భారీగా ఉండనుందని వార్తలు వస్తున్నాయి.
తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆదిపురుష్ రన్ టైం దాదాపు 3 గంటల 16 నిమిషాలు ఉంటుందని సమాచారం. సినిమాలో అంశాలను క్షుణ్నంగా చూపించే కారణంగానే రన్ టైం ఇంత ఎక్కువగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అంత సమయం ఉంటే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక స్పందన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సీతా పాత్రలో కృతి సనన్ నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..