AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha Ruth Prabhu: సమంతకు అరుదైన వ్యాధి.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

సమంతా తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన మ్యాటర్‌ సంచలనం సృష్టిస్తోంది. యశోదా ట్రైలర్‌కు వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందని ట్వీట్‌ చేసిన సమంత అందులో ఒక కొత్త విషయాన్ని వెల్లడించారు.

Samantha Ruth Prabhu: సమంతకు అరుదైన వ్యాధి.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
Samantha Ruth Prabhu - JR NTR
Ram Naramaneni
|

Updated on: Oct 29, 2022 | 6:16 PM

Share

తన అనారోగ్యం గురించి నటి సమంత ఓపెన్ అయ్యింది. మయోసిటిస్‌ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆరోగ్యం నిలకడగానే ఉందని.. త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. చేతికి సెలైన్‌‌ ఎక్కుతుండగా.. యశోద సినిమాకు డబ్బింగ్ చెబుతూ ఆమె ఈ పోస్ట్ చేసింది.  దీంతో సెలబ్రిటీలు అందరూ స్పందిస్తున్నారు. సమంతా త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ధైర్యంగా ఉండాలని సూచించారు.

అటు హీరోయిన్స్ కాజల్, శ్రీయ, అనుష్క, అతియా శెట్టి, రుహాని శర్శ, మాళవిక నాయర్, రాశీ కన్నాలతో పాటు మంచు లక్ష్మీ, సుస్మిత కొణిదెల సోషల్ మీడియా వేదికగా సమంతకు ధైర్యం చెప్పారు. స్ట్రాంగ్‌గా ఉండాలని సూచించారు.  కాగా తన వ్యాధి గురించి పెట్టిన పోస్ట్‌ను ఉద్వేగ భరింతంగా రాసుకొచ్చారు సమంత. జీవితం తనకు అనేక సవాళ్లు విసురుతోందని, అదే సమయంలో ప్రేక్షకులు చూపే ప్రేమ వాటిని అధిగమించే శక్తిని ఇస్తోందని పోస్ట్‌ చేశారు. కొన్ని నెలల క్రితం తనకు ప్రాణాంతకమైన మయోసిటిస్‌ అనే వ్యాధి ఉందనే విషయం తెలిసిందని వెల్లడించారు. ప్రస్తుతం అది తగ్గుముఖం పట్టిందని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే తాను పూర్తిగా కోలుకోగలనని డాక్టర్లు చెప్పారని సమంత పోస్ట్ చేశారు. కాని కోలుకునేందుకు ఊహించిన దానికన్నా ఎక్కువ సమయం పడుతోందని అన్నారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకునేందుకు తాను కష్టపడుతున్నానని ఆమె అన్నారు, భౌతికంగానూ, మానసికంగానూ తనకు మంచి రోజులు, దుర్దినాలు ఉన్నాయని ఒకింత ఆవేదనను ఈ పోస్టులో సమంత షేర్‌ చేశారు. రికవరీకి తాను కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నానని సమంత అన్నారు. నవంబర్‌ రెండు నుంచి యశోదా సినిమా ప్రమోషన్‌ యాక్టివిటీస్‌లో సమంత పాల్గొనే అవకాశం ఉంది.

సమంతకు వచ్చిన మయోసైటిస్‌ వ్యాధి అత్యంత అరుదైనదని చెప్పాలి. ఇది రోగనిరోధకశక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదురవుతాయి. నిల్చునేందుకు కూడా వారికి శక్తి ఉండదు. కండరాలన్నీ బలహీనంగా మారతాయి, నొప్పులు విపరీతంగా ఉంటాయి. కాగా సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న యశోదా వచ్చే నెల 11న విడుదల కానుంది. సరోగసీపై రూపొందించిన ఈ చిత్రం సమంత టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. తెలుగు- తమిళ్‌లో ఈ చిత్రాన్ని సినిమా రూపొందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..