Yatra 2 Trailer: ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’.. ‘యాత్ర 2’ ట్రైలర్ వచ్చేసింది..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో వైఎస్ఆర్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తుండగా.. సీఎం జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. డైరెక్టర్ మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసుకువస్తున్నారు. అదే యాత్ర 2. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో వైఎస్ఆర్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తుండగా.. సీఎం జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించడం నుంచి పాదయాత్ర, ముఖ్యమంత్రిగా గెలుపొందడం వరకు అన్ని ఘటనలను ఈ మూవీలో చూపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ చూస్తుంటే.. ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయాలు, ఘటనలు.. దీంతో ఆ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి కొత్తగా పార్టీ పెట్టడం.. ఆ తర్వాత జైలుకు వెళ్లడం..జైలు నుంచి బయటకు వచ్చి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరును చూపించారు. జగన్ పాదయాత్ర.. ఆ సమయంలో ఎదురైన అనుభవాలను ఊ మూవీ చూపించనున్నాు. 2009 నుంచి 2019 వరకు ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ సినిమాను రానుంది. చివరలో “నేను విన్నాను.. నేను ఉన్నాను” అంటూ జీవా చెప్పే డైలాగ్ హైలెట్ అయ్యింది.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 8న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే అటు మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యింది చిత్రయూనిట్. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
