AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: విజయ్‌తో మరోసారి రొమాన్స్ చేయనున్న స్టార్ బ్యూటీ.. ముచ్చటగా మూడోసారి

లైగర్ ఫ్లాప్ తర్వాత ఖుషి, ది ఫ్యామిలీ మ్యాన్ సినిమాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం కింగ్ డమ్ అనే ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vijay Deverakonda: విజయ్‌తో మరోసారి రొమాన్స్ చేయనున్న స్టార్ బ్యూటీ.. ముచ్చటగా మూడోసారి
Vijay Devarakonda
Rajeev Rayala
|

Updated on: May 09, 2025 | 9:13 PM

Share

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఫ్యామిలీ మ్యాన్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ అచితూచి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కింగ్‌డమ్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్. ఈ సినిమాకు జెర్సీ ఫేమ్ గౌతమ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ లో రఫ్‌ లుక్‌లో విజయ్‌, సీరియస్‌నెస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పక్కా కమర్షియల్‌ ఫార్మేట్‌లో గౌతమ్‌ ఎమోషన్స్ ని ప్యాక్‌ చేశారనే విషయం ఇట్టే అర్థమైపోతోంది జనాలకు.

ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గ ఎదురుచూస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్న విజయ్. వీడి 14 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో టాక్సీవాలా  వచ్చిన విషయం తెలిసిందే..

ఇవి కూడా చదవండి

ఈ సినిమానుపిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా విజయ్ పుట్టిన రోజు సందర్భంగా వీడి 14 ప్రీలుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని టాక్. ఇప్పటికే రష్మిక కథ విని ఒకే చేసిందని అంటున్నారు. గతంలో విజయ్, రష్మిక కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విజయ్, రష్మిక కలిసి నటించనున్నారని తెలుస్తుంది. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..